
గ్రహం అనుగ్రహం, మే 22, 2016
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం, తిథి బ.పాడ్యమి రా.3.10 వరకు
నక్షత్రం అనూరాధ రా.8.41 వరకు
వర్జ్యం రా.2.44 నుంచి 4.28 వరకు
దుర్ముహూర్తం సా.4.40 నుంచి 5.30వరకు
అమృతఘడియలు ఉ.9.19 నుంచి 10.33 వరకు
భవిష్యం
మేషం: ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో త గాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం: శుభవార్తలు అందుతాయి. కార్యజయం. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. కుటుంబ సభ్యులతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపార,ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
సింహం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగు తుంది. దూరప్రయాణాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపార,ఉద్యోగాలలో గంద రగోళం.
కన్య: ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
వృశ్చికం: కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. పనులు చకచకా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపార,ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
ధనుస్సు: సోదరులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
మకరం: కుటుంబసభ్యులతో వివాదాల పరిష్కారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
కుంభం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు