
గ్రహం అనుగ్రహం నవంబర్ 16, 2015
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం
తిథి శు.పంచమి రా.12.03 వరకు
నక్షత్రం పూర్వాషాఢ రా.6.54 వరకు
వర్జ్యం రా.2.45 నుంచి 4.20 వరకు
దుర్ముహూర్తం ప.12.09 నుంచి 12.59 వరకు
తదుపరి ప.2.21 నుంచి 3.11 వరకు
అమృతఘడియలు ప.2.10 నుంచి 3.42 వరకు
భవిష్యం
మేషం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృషభం: నిర్ణయాలు మార్చుకుంటారు. విద్య,ఉద్యోగావకాశాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. పనులు వాయిదా. వ్యాపారాలు,ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం: ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
సింహం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబ,ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కన్య: రాబడికి మించి ఖర్చులు. కొత్త బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనుల్లో అవరోధాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
తుల: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుంటారు. నూతన విద్యావకాశాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మకరం: పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఉద్యోగయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు,ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మీనం: బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. ఆలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
- సింహంభట్ల సుబ్బారావు