నీకైనా నాకైనా | mukunda ramarao kavitha | Sakshi
Sakshi News home page

నీకైనా నాకైనా

Published Sun, Jul 26 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

నీకైనా నాకైనా

నీకైనా నాకైనా

కవిత
 
రెండు చీకటి గర్భాల మధ్య
వంతెన ప్రయాణం
జీవితం
 
చేరే గర్భం ఒకటయినా
చేర్చే గర్భం వేరు
వంతెనలూ వేరే
వాడి పొడవులు మరీ వేరు
 
ఒడి నుంచి దించి
వంతెన ఎక్కించి
ఊపిరి పీల్చుకుంటుంది ఒకటి
వంతెన చివర్లో
సహస్ర హస్తాలతో
తన ఒడిని చాపి
వేచి చూస్తుంది ఇంకొకటి
 
నువ్వో నేనో ఎవరైనా
అప్రయత్నంగా ఆశ్చర్యంగా
ముందే చేరొచ్చు
ఎందుకు అలా అంటే
నీకైనా నాకైనా
జవాబు దొరకదు
అదంతే
 
ముకుంద రామారావు
ఫోన్: 9908347273.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement