గానకళానిధి డా॥వింజమూరి | Musicians of Vinjamuri varadaraja ayyamgar | Sakshi
Sakshi News home page

గానకళానిధి డా॥వింజమూరి

Published Tue, Jul 14 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

గానకళానిధి డా॥వింజమూరి

గానకళానిధి డా॥వింజమూరి

ప్రఖ్యాత సంగీత విద్వాంసులు గానకళానిధి డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ 1915 జూలై 15న గుంటూరులో జన్మించారు. తల్లి కనకవల్లి తాయార్. తండ్రి వింజమూరి భావనాచారి. శ్రీమం తులైన జననీ జనకుల సమక్షంలో సరోజిని నాయు డు, మహాత్మాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి జాతీయ నాయకులతో, వీణ శేషణ్ణ, టైగర్, పచి అయ్యంగార్ వంటి సంగీత ప్రముఖులతో మంచి పరిచయం ఏర్పడింది. ముక్త్యాల సంస్థాన సంగీత విద్వాంసులు పిరాట్ల శంకరశాస్త్రి గారి వద్ద సహోదరి శకుంతల సంగీతం నేర్చుకునే సమయంలో, పసిత నంలోనే వీరికి కూడా సంగీతంలో ఆసక్తి కలిగింది.

అది గమనించిన గురువు ఆ పిల్లవానికి కూడా సం గీత పాఠం ఆరంభించారు. వింజమూరి గురువు గారి పాఠాలని అయస్కాంతంలా ఆకర్షించి గ్రహిం చేవారు. ఏడేళ్ల వయస్సులో వారి తొలి కచ్చేరి మైసూ రు ఆస్థాన విద్వాంసులు వీణ శేషణ్ణ సమక్షంలో జరి గింది. పళ్లెం పూర్ణప్రజ్ఞ వద్ద సంస్కృతం, ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ బీఏ పట్టభద్రులయ్యారు. 1935లో వీరికి విమలాదేవితో వివాహం జరిగింది. 1936లో మదరాసు వెళ్లి వరదాచార్యర్ వద్ద శిష్యు డిగా చేరారు. మదరాసు విశ్వవిద్యాలయంలో సంగీ త విద్వాన్ కోర్సులో అత్యుత్తమ శ్రేణి లో ముగించారు.
 
 ఒక కళాకారుని సాధనమే వారి అభివృద్ధికి ప్రథమ సోపానమని నమ్మి న వింజమూరి రోజుకు 7 నుంచి 14 గంటల వరకు సాధన చేసేవారట. ఆయన ఆసేతు హిమాచలం, బర్మా, సిలోన్, మలేషియా, రంగూన్ వంటి పలు చోట్ల 1945 నుంచి అనేక వేల కచ్చేరీలు చేశా రు. సంగీత సాహిత్య వక్త, రచయిత, పరిశోధకులు గా సంగీత ఎన్‌సైక్లోపీడియాగా పేరుగాంచారు. 22వ ఏట శృంగేరిస్వామి వద్ద గానవిద్యా విశారద బిరుదుని పొందారు. తర్వాత పలు సంస్థలు, సంస్థా నాలచే అనేక బిరుదులతో గౌరవం పొందారు. జమీందారుల సంస్థానాల్లో, రాజదర్బారుల్లలో, రాష్ట్రపతుల సమక్షంలో వారు చేసిన కచ్చేరీలు కోకొల్లలు.

తమ 75 ఏళ్ల జీవితకాలంలో అనేక సభలకు అధ్యక్ష పదవులు వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొట్టమొదటి సంగీత కళాశాలను హైదరాబాద్‌లో స్థాపించి దానికి తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అనేక సం గీత విద్యాసంస్థల స్థాపనకి కారకుల య్యారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలకు ఎగ్జామినర్‌గా ఉన్నారు. ఆకా శవాణిలో సంగీత విభాగ ప్రయోక్తగా వివిధ ప్రసారాలను సృష్టించారు.
 
 1943లో మద్రాసు రేడియో కేంద్రంలో వింజ మూరి ప్రవేశపెట్టిన గానలహరి సంగీత శిక్షణ కార్య క్రమాన్ని ఇతర కేంద్రాలు కూడా అనుసరించాయి. రాగమ్ తానమ్ పల్లవి శీర్షికను ప్రసారం చేసి ఆ అపూర్వ సంగీత ప్రకరణాన్ని ప్రజలకు పరిచయం చేశారు. సుప్రసిద్ధ విద్వాంసులను దేశంలోని పలు ప్రాంతాలనుంచి రప్పించి లయ విన్యాసము ప్రసాక కార్యక్రమం నిర్వహించారు. ప్రసిద్ధ సంగీత వాగ్గేయ కారులను, వారి రాగాల గురించి ప్రసంగించేవారు. భక్తి రంజని కార్యక్రమం మొదలెట్టి మొట్టమొదటిగా అన్నమాచార్య కీర్తనలకు వర్ణమెట్టు కట్టి ప్రసారం చేశారు. వింజమూరి వారు త్యాగరాజు, శ్యామాశాస్త్రి వంటి వాగ్గేయకారుల జీవితాల చరిత్రలను గురించి మాత్రమే కాక, ఇతర వాగ్గేయకారుల గురించి ప్రస్తా వించి, వాటిని ప్రసారం చేశారు.
 
 ఆయన సంగీతంలో దిట్ట, ఘనరాగ మాలికా వర్ణం, స్వరరంజని, సింధురామక్రియ వంటి అపూ ర్వ రాగాలలో వర్ణాలు, శంకరిరాగంలో తిల్లానా, మణిరంగులో జావళీ వంటి అపూర్వ రచనలను చేసిన వాగ్గేయకారులు, అనేక నూతన ప్రక్రియలను ప్రసారాలను సంగీత ప్రపంచానికి అందించిన సృజ నాత్మక మూర్తి. ఇంతటి విద్యా విజ్ఞాన నిలయం సం గీత ప్రపంచంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు- కానేరదు. గత 23 సంవత్సరాలుగా వింజ మూరి పేరిట అనేక అవార్డులు, అనేక ఉత్సవాలు నడుస్తున్నాయి. అందులో పలు ప్రముఖులైన విద్వాంసులు వారి రచనలను పాడి ఉన్నారు. వింజ మూరి వారి శత జయంతి ఈ సంవ త్సరం జులై 15 నుంచి పలు ప్రదేశాలలో ఘనంగా జరగనున్నది.
 (జూలై 15న వింజమూరి వరదరాజ
 అయ్యంగార్ శత జయంతి)
 సంధ్యా రంగన్ గిరి, (వింజమూరి కుమార్తె)
 చెన్నయ్, ఫోన్: 044-22263320

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement