రాజధాని రైతులపై దండోపాయానికీ సై | TDP government forcefully trying to convince to give Capital lands | Sakshi
Sakshi News home page

రాజధాని రైతులపై దండోపాయానికీ సై

Published Tue, Dec 9 2014 1:09 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

రాజధాని రైతులపై దండోపాయానికీ సై - Sakshi

రాజధాని రైతులపై దండోపాయానికీ సై

దేశంలోనే అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటిగా ఉన్న తుళ్లూరు ప్రాంతమే రాజధానికి కావలసి వచ్చిందా? వ్యవసాయంపై ఆధారపడిన 50 వేల మంది రైతు కూలీలు, గ్రామీణ వృత్తుల వారి జీవితాలను అంధకారం చేయదగునా? అబద్ధపు వాగ్దానాలతో అధికారానికి వచ్చిన ఏలికల మాటలు నమ్మి ఎన్నిసార్లు మోసపోవాలి జనం?
 
 నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కి కేంద్రంగా భావిస్తున్న తు ళ్లూరు ప్రాంత రైతులనుద్దే శించి పది వామపక్ష పార్టీలు కలసి ఇటీవల అక్కడ ఒక బహిరంగ సభ జరిపాయి. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసి ఆ ప్రాంత ప్రజలను వంచిస్తున్న కుటిల పన్నాగాన్ని ప్రజల ముందు ఎండగట్టి వాస్తవాలను వివరించడంలో భాగంగా ఆ సభ జరిగింది. ఆ సభలో సీపీఐ కార్య దర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధు, సీపీ (ఎంఎల్) కార్యదర్శి విజయకుమార్ తదితర కమ్యూనిస్టు పార్టీల నేతలు పాల్గొన్నారు. రాజ ధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు కావాలనీ, ముం దుగా 30 వేల ఎకరాలు అవసరమనీ చెబుతూ, రైతుకు దమ్మిడీ ఇవ్వకుండా ఎప్పుడో పదేళ్ల తర్వా త ‘లాటరీ’లో లాగా, మీ భూముల ధరలు పది రెట్లు పెరుగుతాయి కనుక ఎకరానికి వెయ్యి గజాల చొప్పన కొత్త రాజధానిలో భూమి పొందేందుకు ఒప్పుకోండంటున్న ప్రభుత్వ వాదనలోని బండా రాన్ని వామపక్ష నేతలు ఆ సభలో ఎండగట్టారు.
 
 అంతలోనే సభాస్థలిలో కరెంటు పోయింది. పోలోమంటూ స్థానిక తెలుగుదేశం నాయకులు వారి అనుయాయులు అక్కడికి వచ్చి లొల్లి మొదలె ట్టారు. ‘‘మీరు  మీటింగ్ పెట్టే వీలు లేదంటూ, వీరంగం చేశారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, సభకు హాజరైనవారూ కలిసి, వారిని ఎదుర్కొన్నా రు. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏమైతేనేం సభ భగ్నమయింది. మా ప్రభుత్వానికి వ్యతిరేకం గా మాట్లాడితే ఇలాంటి దాడులను ఎదుర్కోవలసి ఉంటుందని ఇది హెచ్చరిక అన్నమాట? సామ దానభేదోపాయాలతో దారికి తెచ్చుకోలేక, ఇక చివరి అస్త్రంగా దండోపాయాన్ని ప్రయోగించేందు కు పాలకపార్టీ సిద్ధపడిందనడానికి ఇదొక సూచన.
 
 ఇది తుళ్లూరులో తెలుగు తమ్ముళ్లకో, చంద్ర బాబు వీరాభిమానులకో వచ్చిన ఆలోచన పర్యవ సానం కాదు. ఇంతకుముందు గోదావరి జిల్లాలో జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు హాజరైనా రు. ఆ జన్మభూమి షూటింగ్ వద్దకు విలేజి యాని మేటర్ ఉద్యోగినులు తమ సమస్యలు చెప్పుకుం దామని వచ్చారు. వీళ్ల చేతుల్లో కార్మిక సంఘపు ఎర్రజండాలున్నాయి. వారికి గౌరవ వేతనం నెలకు 2 వేల రూపాయలు! అదీ 15 నెలల నుండి ఇవ్వ డం లేదు. తమ వేతనం పెంచాలని, పాత బకాయిలు చెల్లించమని సీఎంని అర్థించి విజ్ఞాపన ఇచ్చేందుకువచ్చారు. వారిని పోలీసులు అడ్డగించ డంతో వాళ్లు తమ డిమాండ్లను తెలుపుతూ పెద్దగా నినదించారు. హాజరైనవారిలో కొందరికి వీరి పట్ల సానుభూతి కలిగింది. సభలో కొంత గందరగోళం ఏర్పడింది. ధిక్కారముల్ సైతునా అనే రీతిలో బాబు ‘ఏమిటా పిచ్చి పిచ్చి వేషాలు. ఏం తమా షాగా ఉందా? నాకన్నీ తెలుసు. పనికిమాలిన పార్టీ లు, ఖాళీ అయిన పార్టీలు అల్లరి చేయిస్తే ఏం బెది రిపోం. చూస్తూ  ఊరుకునేది లేదు’ అని గద్దించా రు. ఏముంది? పోలీసులు వాళ్లని సభాప్రాంగణం నుండి తరిమేశారు. ‘ప్రభువే’ అంత అసహనాన్ని బహిరంగంగా ప్రకటిస్తే, వారిపని పట్టండని ఆయ న భృత్యానుభృత్యులకు ఆదేశం ఇచ్చినట్లే.
 
 ఈ భూసమీకరణ పేరుతో రైతులకు దమ్మిడీ కూడా ఇప్పుడు చెల్లించకుండా పదేళ్ల తర్వాత కో ట్లాది రూపాయల ఆదాయం తవ్వి తలకెత్తుతా నని, అందుకు తనది హామీ అని చంద్రబాబు అం టే ఆ బుట్టలో వారి పార్టీ అనుయాయులు తప్ప అన్యులు పడరు. దీంతో ఇక బెదిరింపులకు దిగిం ది ప్రభుత్వం. మర్యాదగా, మేము చెప్పిన షరతు లను ఒప్పుకుని భూసమీకరణకు మీ భూమి ఇవ్వండి! లేదా భూసేకరణకు పూనుకుంటాం! అప్పుడు మీకు హళ్లికి హళ్లీ సున్నకు సున్న అనే బెదిరింపునకు బాబు ప్రభుత్వం సిద్ధపడుతున్నది! దళారీ సింగపూర్  నగరంలో ఒక్క ఎకరం నేల సాగులో లేదు. కనుక ఆ సింగపూర్ వాడికేం తెలుసు భూమితో రైతు కూలీల అనుబంధం? ఏడాదిలో ఏ ఒక్క రోజు కూడా పొలం ఖాళీగా ఉండనంతగా దేశంలోనే అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటిగా ఉన్న  ఈ ప్రాంతమే రాజ ధానికి కావలసివచ్చిందా? ఎంతో శాస్త్రీయంగా ఆలోచిస్తానని చెప్పుకునే బాబుకు ఈ నేలపైనే కన్నుపడిందా? సింగపూర్ వెలుగు జిలుగుల పేరు తో వ్యవసాయంపై ఆధారపడిన 50 వేల మంది రైతు కూలీలు, గ్రామీణ వృత్తుల వారి జీవితాలను అంధకారం చేయదగునా? అందుకే, అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రబుద్ధుల మాటలు నమ్మి ఎన్నిసార్లు మోసపోవాలి జనం? పోనీ బాబు ఒక పని చేయగలరా? ఇప్పుడు ప్రస్తు తం ఉన్న మార్కెట్ (రిజిస్ట్రేషన్ ధర కాదు) ధరకు రైతుల భూమి కొనండి. చట్ట ప్రకారం! రాజధాని నిర్మాణం తర్వాత మీరు ప్రతిపాదిస్తున్నట్లు ఎకరా నికి, వెయ్యి లేదా కనీసం 800 గజాలు ఇవ్వండి. అంతేగానీ, ఉత్తినే భూమి తీసుకుని, అరచేతిలో తేనె చూపిస్తే కుదరదు.
 
 ఆనాడు అర్థాంతరంగా ముగిసిన తుళ్లూరు సభలో సీపీఎం కార్యదర్శి మధు మాట్లాడుతూ ‘మేం వెళ్లిపోవడం లేదు. మళ్లీ వస్తాం? ఇక్కడే మళ్లీ మీటింగ్ పెడతాం!’ అని సవాలు విసిరి మరీ వెళ్లారు. అయితే ఈ సారి కేవలం కమ్యూనిస్టులే కాకుండా, వారితోపాటు ఇతర ప్రజాపక్షం వారినీ, ప్రతిపక్షం వారిని కలుపుకుని ఒక బలమైన సమ రశీల ఉద్యమానికి ఈ ఐక్య కమ్యూనిస్టు కార్యా చరణ శ్రీకారం చుట్టగలదని ఆశిద్దాం!
 (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు)
 డా॥ఏపీ విఠల్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement