Telugu desam government
-
ఎన్నాళ్లీ.. ఎదురుచూపు
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక వేలాదిమంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా వారిలో అతి కొద్దిమందిని మాత్రమే ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. కనీసం వారికైనా పింఛన్ మంజూరు చేశారా అంటే.. అదీ లేదు. ఇక.. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన వారు కూడా ఇప్పటికీ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పింఛన్ అందేంతవరకైనా మా ప్రాణాలు ఉంటాయా అంటూ ఎంతోమంది పండుటాకులు దీనంగా ఎదురుచూస్తున్నారు. కడప రూరల్ : జిల్లాలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత తదితర కేటగిరీలకు చెందిన సామాజిక పింఛన్లను సత్వరమే మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. ఫలితంగా మలిసంధ్యవేళలో ఉన్న వృద్ధులు, అభాగ్యులు ఇబ్బందులు పడుతున్నారు. అర్హులమైనప్పటికీ తమకెందుకు ఈ తిప్పలని వారు మథన పడుతున్నారు. నామమాత్రంగా అర్హుల గుర్తింపు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక జన్మభూమి కార్యక్రమంలో ఆయా మండల ఎంపీడీఓల ద్వారా వివిధ కేటగిరీలకు చెందిన వారు మొత్తం 44,056 మంది పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రభుత్వం ఇటీవల 14,233 మందిని అర్హులుగా గుర్తించింది. వారిని కూడా పంచాయతీ స్థాయిల్లో ఉండే కమిటీ సభ్యులు ధ్రువీకరించిన తర్వాతే వారందరినీ పూర్తి స్థాయి అర్హులుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. అయితే, వారికి ప్రభుత్వం ఎప్పుడు పింఛన్ సొమ్మును మంజూరు చేస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇక అనర్హులుగా ఉన్న వారిని అర్హులుగా గుర్తించడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో అర్థం కావడం లేదు. కిరణ్ పాలనలోని అర్హులకు నేటికీ మోక్షం లేదు! కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పింఛన్లు పొందిన వారిపై టీడీపీ ప్రభుత్వం వచ్చాక కమిటీల పేరుతో ఎడాపెడా అనర్హత వేటు వేసింది. దీంతో వేలాది మందికి పింఛన్లు నిలిచిపోయాయి. కొంతమందికి వచ్చినా ఇంకా ఎంతోమందికి రావాల్సి ఉంది. ఆ ప్రకారం 19,072 మందికి పింఛన్లను నిలిపి వేశారు. వారిలో ఆరు వేల మందికి పైగా అర్హులుగా గుర్తించారు. అయినప్పటికీ వారికి నేటికీ పింఛన్ మంజూరు కాలేదు. అలాగే ఆధార్‌కు సంబంధించిన ఎస్ఆర్బీహెచ్ వారు కూడా ఎంతోమందిని అర్హులుగా గుర్తించారు. వారికి కూడా నేటి వరకు పింఛన్ దక్కలేదు. ఆ సొమ్ము ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అర్హులైన వారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్, ఆయా ఎంపీడీఓ కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.. జిల్లాలో ప్రస్తుతం ప్రతినెల అన్ని కేటగిరీలకు చెందిన వారు 2,38,995 మంది పింఛన్లు పొందుతున్నారు. కాగా, ఒక అంచనా ప్రకారం ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే పింఛన్ పొందుతున్న వారు ప్రతినెల 400 మందికి పైగా మృతి చెందుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పింఛన్లకు అర్హులై పింఛన్ పొందకుండానే మృతి చెందుతున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రజా పంపిణీ అవస్థ
కడప అగ్రికల్చర్: వాస్తవంలో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో అందించిన పాపాన పోలేదు. నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకాన్ని రద్దు చేసి ఎన్టీఆర్ ప్రజా పంపిణీ వ్యవస్థగా పేరు మార్పు చేశారు. పేరు మార్చినా వ్యవస్థ తీరు మాత్రం మారలేదు. చండీఘడ్, చత్తీస్గడ్ రాష్ట్రాలకు రాష్ట్ర మంత్రి సునీత, పౌరసరఫరాలశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వెళ్లి అక్కడి ప్రజా పంపిణీ వ్యవస్థ తీరును చూసి వచ్చారు. వచ్చీరాగానే రాష్ట్రంలో అన్ని సరుకులు పేద ప్రజలకు అందజేస్తామని ఢంకా బజాయించి చెప్పారు. పర్యటనకు వెళ్లి వచ్చి నెలరోజులు దాటినా ఇంతవరకు పౌరసరఫరాల వ్యవస్థ తీరుతెన్నులపై సమీక్షించిన దాఖలాలు లేవని పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7,79,328 రేషన్‌కార్డులు ఉండగా, ఈ రేషన్‌కార్డులకు 1737 షాపుల ద్వారా 3587.73 టన్నుల సరుకులను ప్రజలకు అందజేసేవారు. ఇందులో బియ్యం, చక్కెర, చింతపండు, గోధుమపిండి, పసుపు, కారం పొడి, ఉప్పు, కందిపప్పు, పామోలిన్ వంటి తొమ్మిది రకాల వస్తువులను రూ. 185లకే అందజేస్తూ వచ్చారు. 2014 సంవత్సరం ప్రారంభం వరకు ఆయా సరుకులను ఇస్తూ వచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తొమ్మిదింటిలో కేవలం బియ్యం, చక్కెరతోపాటు కిరోసిన్ మాత్రమే ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత కిరోసిన్ ఒక నెలలో ఇస్తే మరో నెలలో ఇవ్వడంలేదని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం అన్ని సరుకులను ప్రజలను అందజేస్తామని చెప్పి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయినా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు, ఐదుగురు సభ్యులు ఉన్న పేద కుటుంబాల వారు రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి ఉంటోంది. ఈ పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులను సక్రమంగా ఇస్తుంటే మూడు పూటల భోజనం చేసేవారు. ఈ సరుకులు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి పప్పుకూడు తినలేని పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో పక్క డీలర్లు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంగానే ఉన్నారు. గతంలో తొమ్మిది సరుకులు ఇచ్చేటపుడు ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, ఇప్పుడు ఆయా వస్తువులు ఇవ్వకపోవడంతో తాము మొత్తం సరుకులను తినేస్తున్నట్లు కార్డుదారులు శాపనార్థాలు పెడుతుంటే భరించలేక పోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పిదానికి తాము మాట పడాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. -
రాజధాని రైతులపై దండోపాయానికీ సై
దేశంలోనే అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటిగా ఉన్న తుళ్లూరు ప్రాంతమే రాజధానికి కావలసి వచ్చిందా? వ్యవసాయంపై ఆధారపడిన 50 వేల మంది రైతు కూలీలు, గ్రామీణ వృత్తుల వారి జీవితాలను అంధకారం చేయదగునా? అబద్ధపు వాగ్దానాలతో అధికారానికి వచ్చిన ఏలికల మాటలు నమ్మి ఎన్నిసార్లు మోసపోవాలి జనం? నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కి కేంద్రంగా భావిస్తున్న తు ళ్లూరు ప్రాంత రైతులనుద్దే శించి పది వామపక్ష పార్టీలు కలసి ఇటీవల అక్కడ ఒక బహిరంగ సభ జరిపాయి. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసి ఆ ప్రాంత ప్రజలను వంచిస్తున్న కుటిల పన్నాగాన్ని ప్రజల ముందు ఎండగట్టి వాస్తవాలను వివరించడంలో భాగంగా ఆ సభ జరిగింది. ఆ సభలో సీపీఐ కార్య దర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధు, సీపీ (ఎంఎల్) కార్యదర్శి విజయకుమార్ తదితర కమ్యూనిస్టు పార్టీల నేతలు పాల్గొన్నారు. రాజ ధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు కావాలనీ, ముం దుగా 30 వేల ఎకరాలు అవసరమనీ చెబుతూ, రైతుకు దమ్మిడీ ఇవ్వకుండా ఎప్పుడో పదేళ్ల తర్వా త ‘లాటరీ’లో లాగా, మీ భూముల ధరలు పది రెట్లు పెరుగుతాయి కనుక ఎకరానికి వెయ్యి గజాల చొప్పన కొత్త రాజధానిలో భూమి పొందేందుకు ఒప్పుకోండంటున్న ప్రభుత్వ వాదనలోని బండా రాన్ని వామపక్ష నేతలు ఆ సభలో ఎండగట్టారు. అంతలోనే సభాస్థలిలో కరెంటు పోయింది. పోలోమంటూ స్థానిక తెలుగుదేశం నాయకులు వారి అనుయాయులు అక్కడికి వచ్చి లొల్లి మొదలె ట్టారు. ‘‘మీరు మీటింగ్ పెట్టే వీలు లేదంటూ, వీరంగం చేశారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, సభకు హాజరైనవారూ కలిసి, వారిని ఎదుర్కొన్నా రు. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏమైతేనేం సభ భగ్నమయింది. మా ప్రభుత్వానికి వ్యతిరేకం గా మాట్లాడితే ఇలాంటి దాడులను ఎదుర్కోవలసి ఉంటుందని ఇది హెచ్చరిక అన్నమాట? సామ దానభేదోపాయాలతో దారికి తెచ్చుకోలేక, ఇక చివరి అస్త్రంగా దండోపాయాన్ని ప్రయోగించేందు కు పాలకపార్టీ సిద్ధపడిందనడానికి ఇదొక సూచన. ఇది తుళ్లూరులో తెలుగు తమ్ముళ్లకో, చంద్ర బాబు వీరాభిమానులకో వచ్చిన ఆలోచన పర్యవ సానం కాదు. ఇంతకుముందు గోదావరి జిల్లాలో జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు హాజరైనా రు. ఆ జన్మభూమి షూటింగ్ వద్దకు విలేజి యాని మేటర్ ఉద్యోగినులు తమ సమస్యలు చెప్పుకుం దామని వచ్చారు. వీళ్ల చేతుల్లో కార్మిక సంఘపు ఎర్రజండాలున్నాయి. వారికి గౌరవ వేతనం నెలకు 2 వేల రూపాయలు! అదీ 15 నెలల నుండి ఇవ్వ డం లేదు. తమ వేతనం పెంచాలని, పాత బకాయిలు చెల్లించమని సీఎంని అర్థించి విజ్ఞాపన ఇచ్చేందుకువచ్చారు. వారిని పోలీసులు అడ్డగించ డంతో వాళ్లు తమ డిమాండ్లను తెలుపుతూ పెద్దగా నినదించారు. హాజరైనవారిలో కొందరికి వీరి పట్ల సానుభూతి కలిగింది. సభలో కొంత గందరగోళం ఏర్పడింది. ధిక్కారముల్ సైతునా అనే రీతిలో బాబు ‘ఏమిటా పిచ్చి పిచ్చి వేషాలు. ఏం తమా షాగా ఉందా? నాకన్నీ తెలుసు. పనికిమాలిన పార్టీ లు, ఖాళీ అయిన పార్టీలు అల్లరి చేయిస్తే ఏం బెది రిపోం. చూస్తూ ఊరుకునేది లేదు’ అని గద్దించా రు. ఏముంది? పోలీసులు వాళ్లని సభాప్రాంగణం నుండి తరిమేశారు. ‘ప్రభువే’ అంత అసహనాన్ని బహిరంగంగా ప్రకటిస్తే, వారిపని పట్టండని ఆయ న భృత్యానుభృత్యులకు ఆదేశం ఇచ్చినట్లే. ఈ భూసమీకరణ పేరుతో రైతులకు దమ్మిడీ కూడా ఇప్పుడు చెల్లించకుండా పదేళ్ల తర్వాత కో ట్లాది రూపాయల ఆదాయం తవ్వి తలకెత్తుతా నని, అందుకు తనది హామీ అని చంద్రబాబు అం టే ఆ బుట్టలో వారి పార్టీ అనుయాయులు తప్ప అన్యులు పడరు. దీంతో ఇక బెదిరింపులకు దిగిం ది ప్రభుత్వం. మర్యాదగా, మేము చెప్పిన షరతు లను ఒప్పుకుని భూసమీకరణకు మీ భూమి ఇవ్వండి! లేదా భూసేకరణకు పూనుకుంటాం! అప్పుడు మీకు హళ్లికి హళ్లీ సున్నకు సున్న అనే బెదిరింపునకు బాబు ప్రభుత్వం సిద్ధపడుతున్నది! దళారీ సింగపూర్ నగరంలో ఒక్క ఎకరం నేల సాగులో లేదు. కనుక ఆ సింగపూర్ వాడికేం తెలుసు భూమితో రైతు కూలీల అనుబంధం? ఏడాదిలో ఏ ఒక్క రోజు కూడా పొలం ఖాళీగా ఉండనంతగా దేశంలోనే అత్యంత సారవంతమైన ప్రాంతాలలో ఒకటిగా ఉన్న ఈ ప్రాంతమే రాజ ధానికి కావలసివచ్చిందా? ఎంతో శాస్త్రీయంగా ఆలోచిస్తానని చెప్పుకునే బాబుకు ఈ నేలపైనే కన్నుపడిందా? సింగపూర్ వెలుగు జిలుగుల పేరు తో వ్యవసాయంపై ఆధారపడిన 50 వేల మంది రైతు కూలీలు, గ్రామీణ వృత్తుల వారి జీవితాలను అంధకారం చేయదగునా? అందుకే, అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రబుద్ధుల మాటలు నమ్మి ఎన్నిసార్లు మోసపోవాలి జనం? పోనీ బాబు ఒక పని చేయగలరా? ఇప్పుడు ప్రస్తు తం ఉన్న మార్కెట్ (రిజిస్ట్రేషన్ ధర కాదు) ధరకు రైతుల భూమి కొనండి. చట్ట ప్రకారం! రాజధాని నిర్మాణం తర్వాత మీరు ప్రతిపాదిస్తున్నట్లు ఎకరా నికి, వెయ్యి లేదా కనీసం 800 గజాలు ఇవ్వండి. అంతేగానీ, ఉత్తినే భూమి తీసుకుని, అరచేతిలో తేనె చూపిస్తే కుదరదు. ఆనాడు అర్థాంతరంగా ముగిసిన తుళ్లూరు సభలో సీపీఎం కార్యదర్శి మధు మాట్లాడుతూ ‘మేం వెళ్లిపోవడం లేదు. మళ్లీ వస్తాం? ఇక్కడే మళ్లీ మీటింగ్ పెడతాం!’ అని సవాలు విసిరి మరీ వెళ్లారు. అయితే ఈ సారి కేవలం కమ్యూనిస్టులే కాకుండా, వారితోపాటు ఇతర ప్రజాపక్షం వారినీ, ప్రతిపక్షం వారిని కలుపుకుని ఒక బలమైన సమ రశీల ఉద్యమానికి ఈ ఐక్య కమ్యూనిస్టు కార్యా చరణ శ్రీకారం చుట్టగలదని ఆశిద్దాం! (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు) డా॥ఏపీ విఠల్ -
ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు బంద్
పేదల పాలిట అపర సంజీవనిగా పేరుగాంచిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం తెలుగుదేశం ప్రభుత్వం రాకతో అనారోగ్యం బారినపడింది. ప్రస్తుతం దీని పేరు మార్చి ‘ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ’గా నామకరణం చేశారు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకునే రోగులకు ఒక్క రోజులో అనుమతి వచ్చేది. ఇప్పుడు వారం నుంచి పది రోజులు కూడా పడుతోంది. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్) వంటి పెద్దాసుపత్రి మొదలు పలు నెట్వర్క్ ఆస్పత్రుల్లో సైతం ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు నిలిపివేశారు. సాక్షి, గుంటూరు/ మెడికల్: ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు జరగాలంటే రోజుల పాటు ఆసుపత్రుల్లో మూల గాల్సిన దుస్థితి ఏర్పడిందని రోగులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ అనుమతులు రాకపోవడంతో రోగుల బంధువుల నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగు తోందని, మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుమతి ఇవ్వకుండా ఆపరేషన్లు చేస్తే దానికి ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2008 జూలై 7న ఈ పథకం ప్రారంభమైంది. కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఈ పథకంలో మార్పులు జరిగాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్న 126 రకాల ఆపరేషన్లు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తొలగించి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాదికి రెండులక్షల రూపాయల వరకు ఖర్చుఅయ్యే వ్యాధులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం పొందే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 2న ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చి, అనుమతుల మంజూరులో కోతలు విధించింది. అనుమతుల్లో ఆలస్యం... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండటంతో పలు ఆస్పత్రుల్లో ఆపరేషన్ కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేసినా వాటికి రావాల్సిన పారితోషికాలు విడుదల చేయకపోవడంతో ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు చేసేందుకు వైద్యులు ఆసక్తిచూపించటం లేదు. జీజీహెచ్‌లో గతంలో నెలకు రూ.కోటికిపైగా పారితోషికాల రూపంలో ఆస్పత్రికి వచ్చే ఆదాయం నేడు కేవలం రూ.19లక్షలకు పడిపోయిందంటే అనుమతులు ఇవ్వడంలో ప్రభుత్వం ఏ మేరకు జాప్యం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2014 జూన్‌లో ఆరోగ్యశ్రీ కింద జీజీహెచ్‌లో 854 ఆపరేషన్లు చేయగా, 494 ఆపరేషన్లుకు మాత్రమే రూ.10,976,816 లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిధులను చెల్లించింది. జూలైలో 940 ఆపరేషన్లు చేస్తే 888 ఆపరేషన్లుకు రూ. 18,033,082లు చెల్లించింది. ఆగస్టు నెలలో 947 ఆపరేషన్లు చేయగా 115 ఆపరేషన్లుకు మాత్రమే రూ.19,92,891లు చెల్లించింది. సెప్టెంబర్‌లో 886 ఆపరేషన్లు చేయగా 648 ఆపరేషన్లుకు రూ.12,684,428 చెల్లించింది. ఆగస్టు నెలలో జీజీహెచ్‌లోని కార్డియాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ విభాగాల్లో చికిత్స పొందిన రోగుల్లో ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం క్లెయిమ్ చెల్లించలేదు. న్యూరో సర్జరీ విభాగంలో ఐదుగురికి, ఆర్థోపెడిక్ విభాగంలో ఏడుగురికి, జనరల్ సర్జరీ విభాగంలో 11 మందికి మాత్రమే పారితోషికాలు చెల్లించింది. ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుండడంతో జీజీహెచ్‌లోని కొన్ని వైద్య విభాగాల్లో, జిల్లాలోని పలు నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలను నిలిపివేస్తున్నారు. మన బిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటామా... తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రులకు వచ్చే నిరుపేదలకు వెంటనే ఆపరేషన్లు చేయాలంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అనుమతులు రావడం ఆలస్యమౌతుంది. దీని వల్ల రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు దృష్టిసారించి సమస్యను సత్వరమే పరిష్కరించాలి. ఇదే మన ఇంటిలో బిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటామా, పేదవారికి ఉపయో గపడినప్పుడే ఈ పథకానికి సార్థకత ఉంటుంది. ఆలస్యం అవుతున్న మాట వాస్తవమే... ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు చేసేందుకు గతంలో వెంటనే అనుమతి ఇచ్చేవారం. నేడు కొంత సమయం పడుతోంది. జిల్లాలో 32 నెట్వర్క్ ఆస్పత్రుల ద్వారా వైద్యసేవలు అందుతున్నాయి. వీటిల్లో ఐదు ప్రభుత్వ ఆస్పత్రులు కాగా 27 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. - డాక్టర్ కె.విజయభాస్కరరెడ్డి, ఆరోగ్యశ్రీ, జిల్లా కోఆర్డినేటర్ -
రుణ మాఫీపై పిల్లిమొగ్గలు ఇంకెన్నాళ్లు?
రైతు రుణాల రద్దుపై తెలుగుదేశం ప్రభుత్వం తొలి నుంచీ పిల్లిమొగ్గలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నది. ప్రభుత్వం పనిచేస్తున్నది స్వార్థపూరిత రాజకీయ లబ్ధికోసమే తప్ప, తమ సంక్షేమం కోసం కాదనే విషయం ప్రజలకు బోధపడింది. పూర్తిస్థాయిలో రైతుల రుణ మాఫీ ఇప్పటికి లేదనే విషయం స్పష్టంగా తేలిపోయింది. చంద్రబాబు కట్టుకథలతో రైతాంగాన్ని ఇంకా ఎన్నాళ్లు మభ్యపెడతారు? ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎన్నికల హామీలను గుప్పించిన తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారమిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం చేపట్టగానే మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా తమ రూ. 87,612 కోట్ల రుణాలన్నీ ఒక్క సంతకంతో మాఫీ అయిపోతాయని, ఇతర వర్గాల ప్రజల మాదిరిగానే, రైతులు కూడా ఆశించారు. అయితే రైతులు అనుకున్నదొకటి. అయ్యింది వేరొకటి. రుణ మాఫీ.. కొత్త రుణాల వితరణ సజావుగా జరిగి ఉంటే పంటలకు బీమా రక్షణ లభించేది. కానీ, ప్రభుత్వ నిర్వాకం పుణ్యమా అని బీమా రక్షణ లేని పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర రైతులు నిలువునా మునిగిపోయారు. కల్లబొల్లి మాటలతోనే కాలక్షేపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పరిపాలనా పగ్గాలు చేపట్టి 5వ నెల కూడా గడచిపోతున్నది. కొండంత ఆశతో రైతులు ఎదురుచూస్తున్న రుణ మాఫీ విషయం మాత్రం నానాటికీ జటిలమవుతున్నదే తప్ప, నిర్దిష్ట పరిష్కార మార్గమేదీ కనుచూపు మేరలో కనబడటం లేదు. ఇదేనా అపారమైన పాలనానుభవం? రైతు రుణాల రద్దుపై తెలుగుదేశం ప్రభుత్వం తొలి నుంచీ ఎన్నో పిల్లిమొగ్గలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న తీరు నయవంచన తప్ప మరొకటి కాదు. ‘‘నిపుణులతో చర్చించి, మాకున్న అపారమైన పరిపాలన అనుభవాన్ని జోడించి మేనిఫెస్టోను రూపొందించాం.. దీనిలో పేర్కొన్న ప్రతి ఒక్క హామీని, పథకాన్ని, ప్రణాళికనూ చిత్తశుద్ధితో అమలుచేస్తాం, ఆచరణలో ఆదర్శంగా నిలుస్తాం..’’ ఇదీ తెలుగుదేశం ఎన్నికల నాటి మాట. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతోనే మీ రుణాలన్నీ మాఫీ అయిపోతాయి.. మీరు బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు..’ అని చంద్రబాబు ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. ఈ మాటలు నమ్మి నట్టేట మునిగిపోయామని క్రమేపీ గాని రైతులకు అర్థం కాలేదు. రుణాల పూర్తి మాఫీ కాదు.. రూ. లక్షన్నర మేరకే.. అదికూడా పంట రుణాలు మాత్రమేనని.. బంగారంపై మహిళలు తీసుకున్న వ్యవసాయ రుణాలు మాత్రమేనని.. అది కూడా రూ.50 వేల మేరకే మాఫీ అని.. ఇంటిలో ఒకరి రుణాలే రద్దని.. ఎన్ని విధాలా ఆంక్షలు విధించాలో అన్నిటినీ తెరపైకి తెచ్చారు. బూటకపు వాగ్దానాల అసలు రంగు బట్టబయలు తాను చెప్పినట్లు నడచుకునే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, ఆ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామిగా ఉందని, రుణమాపీ పెద్ద సమస్య కాదని చంద్రబాబు నమ్మబలికారు. తీరా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుండ బద్దలు కొట్టినట్లు అసలు సంగతి బయటపెట్టారు. వ్యవసాయ రుణాల మాఫీ కేంద్రానికి సంబంధం లేదని, అసలు రుణ మాఫీ విధానమే మంచి సంప్రదాయం కాదని ఆయన ప్రకటించడంతో రాష్ట్ర రైతాంగం నివ్వెరపోయింది. గతంలో డా. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రుణ మాఫీ చేశారు. ఎన్నికల వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలుచేశారు. అదేమాదిరిగా చంద్రబాబు నాయుడు కూడా చేస్తాడని అతిగా ఊహించుకున్నారు. కానీ, చంద్రబాబు చేసిన రుణ మాఫీ వాగ్దానంలో విశ్వసనీయత లేదని, ఆనాడు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మాత్రమే హామీ ఇచ్చారని, చంద్రబాబు నాయుడు చేసినవి బూటకపు వాగ్దానాలేనని ఈనాడు వాపోతున్నారు. రుణ మాఫీలో జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతుల దృష్టిని చంద్రబాబు బ్యాంకు వైపు, రిజర్వ్ బ్యాంకు వైపు మళ్లించారు. అయితే, వివిధ పరిణామాల అనంతరం రుణ మాఫీకి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ వ్యవస్థలు తోసిపుచ్చాయి. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల వాగ్దానాల అమలులో బ్యాంకులు భాగస్వాములు కాలేవని, కాకూడదని నిర్మొహమాటంగా తేల్చి చెప్పాయి. ఏది వాస్తవం? ఏది అవాస్తవం?! అయినా, ఏదో ఒకటి చెప్పి రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలను మాత్రం ప్రభుత్వం ఇప్పటికీ మానుకోలేదు. రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేయడం కూడా ఈ కోవలోనిదే. ఇది లిమిటెడ్ లయబిలిటీ కార్పొరేషన్. దీనికి రూ.5 వేల కోట్ల మూల ధనం కేటాయించారు. ఆ మేరకు బాండ్లను విడుదల చేయడం వరకే దీని విధి. రైతులకు 10% వడ్డీతో బాండ్లు ఇస్తామని, రైతులపై ఉన్న రుణభారంలో 20% రుణాన్ని ఈ సంవత్సరం మాఫీ చేసి, రాబోయే 4 ఏళ్లలో 10% వడ్డీతో రైతులకు బాండ్లు ఇవ్వడం ద్వారా రుణ మాఫీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయితే, ఇప్పుడు బాండ్లు ఇస్తాం.. 2015 జనవరి తర్వాత రైతులు ఈ బాండ్లను సంస్థకు అందజేస్తే 10% వడ్డీతో పూర్తి నగదు ఇస్తారని వనరుల సమీకరణ కమిటీ అధ్యక్షుడు సుజనా చౌదరి అంటున్నారు. ఏది వాస్తవమో? ఏది అవాస్తవమో భగవంతునికే తెలియాలి. ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు? రైతు సాధికార సంస్థకు ఏటా కేటాయించే రూ. 5 వేల కోట్లు రుణ బకాయిలపై వడ్డీ(ఏటా రూ.13 వేల కోట్లు) చెల్లించడానికి కూడా సరిపోవు. అలాంటప్పుడు రూ. 87,612 కోట్ల రుణ మాఫీ ఎప్పటికి పూర్తయ్యేను? దీని అర్థం ఏమిటంటే.. రుణ మాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ఎప్పటికీ రుణ విముక్తులయ్యే అవకాశమే లేదు. కాబట్టి రుణ మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం రైతులను ఇంకా మభ్యపెట్టడం తగదు. ఎన్నికల వాగ్దానం మేరకు పూర్తి రుణ మాఫీ చేయడం ఇప్పట్లో జరగదని తేలిపోయింది. అయినా.. కట్టుకథలు చెప్పి రైతాంగాన్ని చంద్రబాబు ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు? ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. రుణ మాఫీపై అనుసరించదలచిన విధానాన్ని ఇప్పటికైనా స్పష్టం చేయాలి. - ప్రొ. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యవసాయ రంగ నిపుణులు -
పెంచుతారనుకుంటే కుదించారు
మాడుగుల రూరల్ : పింఛను మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులను కుదించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక భద్రత పథకం కింద ప్రతినెలా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందించే పింఛన్లలో కోత విధించడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల నుం చి వృద్ధులు, వితంతువులకు రూ. 200 నుంచి రూ.వెయ్యి, 40 నుంచి 80 శాతం వికలాంగత్వం ఉన్నవారికి రూ.వెయ్యి, 80 నుంచి 100 శాతం ఉన్నవారికి రూ.1500 చొప్పున అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లలో కోత విధించింది. ఈ మేరకు పోస్టాఫీస్‌లకు అందిన స మాచారం ప్రకారం మండలంలో 9076 మంది లబ్ధిదారులలో 1150 మందిని జాబితా నుంచి తప్పిం చారు. గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షుడిగా, కార్యదర్శి కన్వీనర్‌గా ఉన్న పింఛను అర్హత సర్వే కమిటీలు ఈ నెల 2వ వారంలో నివేదికలు మండల కమిటీకి అందజేశాయి. మండలంలో 18 మంది పింఛన్లు తొలగించడానికి మండల కమిటీ సిఫార్సు చేసింది. అధిక సంఖ్యలో లబ్ధిదారులకు గత నెల పింఛన్ సొ మ్ము వారి ఖాతాల్లో వేయలేదు. పింఛన్ల కోత విషయంలో తమకు ఏమీ తెలియదని అధికారులు స్ప ష్టం చేస్తున్నారు. ఇంత మొత్తంలో కోత విధించడం తమకు తెలియదని ఎంపీడీఓ శచీదేవి చెప్పారు. -
వాగ్దానం మాఫీ
రుణాల రద్దు కష్టమని తేల్చి చెప్పిన ప్రభుత్వం రూ.1050 కోట్లు మాఫీ లేనట్టే! 20 శాతం మందికే రీషెడ్యూల్ ఆందోళనలో జిల్లా రైతాంగం ఊహించినట్టే జరిగింది. తప్పుడు హామీలతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం మాట మార్చింది. రుణ మాఫీ సాధ్యం కాదని చెప్పకనే చెప్పింది. రుణాల రీషెడ్యూల్‌తో చేతులు దులుపుకోవాలని చూస్తోంది. ఇందులోనూ షరతులు, ఆంక్షలంటూ వీలైనంత తక్కువ మందికి వర్తింప చేయాలని యోచిస్తోంది. విశాఖ రూరల్: రుణమాఫీపై ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. గతేడాది వరదలు, కరువు మండలాల్లోని రైతులకు మాత్రమే రీషెడ్యూల్ అంటూ ప్రకటించింది. ఈ నిర్ణయం జిల్లా రైతులకు అశనిపాతమే. కనీసం 20 శాతం మందికి కూడా రీషెడ్యూల్ అమలుకాదు. ఖరీఫ్ ప్రారంభమై నారుపోతలు పూర్తయ్యాయి.. ఇప్పటికీ కొత్త రుణాలు లేవు. రుణ మాఫీ ఆశతో అన్నదాతలు ప్రైవేటు ఫైనాన్సర్ల నుంచి అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు పనులు ప్రారంభించారు. తీరా ఇప్పుడు రుణాల రద్దు కష్టమని సాక్షాత్తూ సీఎం ప్రకటించడంతోదిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. రూ.1050 కోట్లు రుణాలు మాఫీ లేనట్టే! : గత ఖరీఫ్‌లో జిల్లాలో 1,32,375 మంది రైతులకు రూ.640 కోట్లు రుణాలు అందజేశారు. అలాగే రబీలో 14,548 మంది రైతులకు రూ.104 కోట్లు అప్పులిచ్చారు. గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హతకార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1లు మాత్రమే పంట రుణాలు కింద ఇచ్చారు. పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. దీంతో పాటు లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు 11.73 కోట్లు వడ్డీ లేని రుణాలుగా ఇచ్చారు. వీటితో పాటు రూ.150 కోట్లు వరకు బంగారంపై రుణాలు అందించారు. రుణ మాఫీ జరిగితే అన్ని రకాల రుణాలు కలిపి మొత్తం రూ.1050 కోట్లు రద్దవుతాయని రైతులు భావించారు. 20 శాతం మందికే రీషెడ్యూల్! : జిల్లాలో గతేడాది వర్షాభావం కారణంగా 30 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ప్రభుత్వం ఒక మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. దీని ప్రకారం ఒక్క రైతుకు కూడా రీషెడ్యూల్ వర్తించే అవకాశం లేదు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో అల్పపీడనం, తుపాను కారణంగా భారీగా పంటలు నీటమునిగాయి. జిల్లాలో 34 మండలాల్లో మొత్తంగా 52,426 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం వీరికి మాత్రమే రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశముంది. వీరిలో కూడా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రుణాలు పొంది ఉంటే వారికి కూడా రీషెడ్యూల్ వర్తించదు. అలాగే బంగారంపై రుణాలు పొందిన వారు 50 శాతానికి పైనే ఉన్నారు. దీని ప్రకారం జిల్లాలో 20 శాతం మంది రైతులకు కూడా రుణాలు రీషెడ్యూల్ జరిగే అవకాశం కనిపించడం లేదు. రీషెడ్యూలైన రైతులకు కూడా వడ్డీ భారం పడనుంది. కొత్త రుణాలు కష్టమే.. : జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్దేశించారు. జిల్లాలో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు, రెన్యువల్స్‌గా 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలే దని అధికారులు చెబుతున్నారు. -
మొండి‘హస్తం’
అమ్మహస్తం రద్దుకు ప్రభుత్వం నిర్ణయం ఎన్టీఆర్ ప్రజాపంపణీ పేరుతో కొత్త పథకం ఇప్పటికే పచ్చ రంగులో తాత్కాలిక కూపన్లు కిలో రూపాయి బియ్యం ధర పెరిగే అవకాశం విశాఖ రూరల్ : ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పేదవాడి ‘చౌక’ సరుకులు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. బడుగు జీవుల బతుకులు భారం కానున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ‘అమ్మహస్తం’ పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమవుతోంది. సరుకుల్లో కోత విధించి ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పేరుతో కొత్త పథకం అమలుకు నిర్ణయించింది. చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై అందిస్తున్న సరుకుల ధరలను పెంచాలని భావిస్తోంది. ప్రధానంగా కిలో రూపాయి బియ్యాన్ని రూ.5కు విక్రయించాలని యోచిస్తోంది. రేషన్దాకాణాల ద్వారా ఏయే సరుకులు ఎంత ధరకు విక్రయించాలన్న విషయంపై త్వరలోనే విధివిధానాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తాత్కాలిక రేషన్కూపన్లు పచ్చరంగుకు మారిపోయాయి. ఎన్టీఆర్ ప్రజాపంపిణీ పేరుతో ఉన్న వాటిని అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. 5 నెలలుగా పామాయిల్ లేదు జిల్లాలో 12.5 లక్షల తెల్లరే షన్‌కార్డుదారులు ఉన్నారు. చౌక దుకాణాల నుంచి వీరు ప్రతీ నెలా ఏ వస్తువు తీసుకోకపోయినా పామాయిల్‌ను మాత్రం కచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మార్చి నుంచి దీని పంపిణీ నిలిచిపోయింది. ప్రస్తుతం బహిరంగమార్కెట్లో పామోలిన్ లీటర్ ధర రూ.63లకు పైగా ఉంది. దీనిని రూ.40కే చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మలేషియా నుంచి క్రూడ్‌ను కొనుగోలు చేయగా కాకి నాడ పోర్టుకు తీసుకువచ్చి అక్కడ పామాయిల్‌ను ప్యాకింగ్ చేసి జిల్లాలకు కేటాయించేవారు. కానీ గత ఐదు నెలలుగా పామాయిల్‌ను కొనుగోలు చేయలేదు. దీంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్లో లీటర్ పామోలిన్‌ను రూ.63 నుంచి రూ.68కు కొనుగోలు చేయాల్సి వస్తోంది. చౌక బియ్యం ధర పెంపు! చౌక బియ్యం ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కిలో రూ.2 బియ్యం పథకాన్ని ప్రారంభించారు. తరువాత అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు దీనిని కార్డుదారులకు భారంగా మార్చేశారు. తొలుత రూ.3.25కు, తరువాత రూ.5కు పెంచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ రూ.2కే కిలో బియ్యాన్ని అందించారు. తరువాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కిలో రూపాయికే అందించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బియ్యం కిలో రూ.5కు విక్రయించాలని నిర్ణయించినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చౌక వస్తువుల ధరలు పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. దీంతో కార్డుదారుల్లో ఆందోళన మొదలైంది. నెలకో వస్తువు మాయం తెల్లకార్డుదారులకు గత ప్రభుత్వం అమ్మహస్తం పథకంలో లీటర్ పామాయిల్, కందిపప్పు, గోధుమలు, గోధుమపిండి, ఉప్పు కిలోచొప్పున, పంచదార 500 గ్రాములు, కారం 250 గ్రాములు, పసుపు 100 గ్రామాలు, చింతపండు అరకిలో కలిపి రూ.185కే అందిస్తామని ప్రకటించింది. వాటిని ఒక్క నెల కూడా సక్రమంగా పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. ఈ సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో కార్డుదారులు ఆసక్తి చూపించ లేదు. ఫలితంగా తొలుత కారం, పసుపు, చింతపండు పంపిణీని నిలిపివేశారు. పురుగులు పట్టిన గోధుమలు, గోధుమ పిండి పంపిణీ చేస్తున్నప్పటికీ ఎవరూ విడిపించుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం కందిపప్పు, పంచదార మినహా మిగిలిన అన్ని సరుకుల పంపిణీ నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం వీటిని కూడా ఆపేస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.