గుడి పండగ
ఎఱంద ప్రాంతంలో అప్పలకొండ క్రీ.శ.1100 (నేటి సింహాచలం)
పదం నుంచి పథంలోకి 14
మహాపాత్రుడు వైఖాసన క్రమంలో వరాహనృసింహుని దేవస్థానాధిపతి. క్షేత్రంలో భండారి, శ్రీకరణం, కోష్టకరణం (కొట్టులెక్కల అధికారి), ఆచార్యుడు, అర్చకులు, బోయలు, గొల్లలు, సానులు గల పరిషత్తులో అతడి మాటంటే వేదవాక్కు. అతడి కొడుకు తిరిగి వచ్చిన సందర్భంలో మహాపాత్రుని ఇంట్లో సందడి అంతింత కాదు. దానికి తోడు కటకమానపు గిరిప్రదక్షిణం కళింగంలోనే పెద్దపండగ.
‘పండగ కాగానే కోడలిని ఇంటికి తెచ్చుకుంటే బాగుంటుంది, ఏమంటారు?’ అడిగింది మహాపాత్రుడి ఇల్లాలు.
‘అవునవును! ఇవాళ మంచిరోజు. శకునాలూ బాగున్నాయి. గుడికి వెళ్ళగానే నీ అన్నకి కమ్మ రాసి శ్రీకూర్మానికి పంపిస్తాను. కార్తీకమాసంలో ముహూర్తం పెట్టి పంపిస్తే మనవాణ్ని శోభనానికి పంపిద్దాం’
‘మనమూ వెళ్దామండీ. అన్నయ్యనీ వదినెనీ చూసి చాలా నాళ్ళయింది’
‘పోయిన సంక్రాంతికే గదే వెళ్లావ్? నేనయితే కోడలిని పెళ్ళిలో చూడటమే. ఏడే ళ్ళయింది. గుడి పనులతో క్షణం తీరిక దొరకదు. అయినా ఈసారి తప్పదులే. అప్పగింతలకి మనం లేకుంటే ఎలా?’
మూల కూర్చోని వెక్కివెక్కి ఏడుస్తోంది ముత్యాలు.
‘అక్కా! ఏడ్వమాకే. నువు లానంటే నానెట్టాగే పోయేది?’ పూరింటి వసారా అరుగు మీద బారెడు జడకి మొగలిరేకులు అల్లి, సింగారాన్ని రాగి అద్దంతో చూసుకుని మురిసిపోతూ అడిగింది దాని చెలె ్లలు కన్నమ్మ- ‘బేగా తయ్యరైపో. ఏటంటావ్?’ అంది. ‘ఆడ్ని పొట్టనెట్టుకున్న ఆ దేముణ్నేటికే నాను మొక్కేది? నువె ్వల్లు. నాను లాను’ కొంగుతో మొగం తుడుచుకుంటూ జవాబిచ్చింది ముత్యాలు. ‘నీవో మారు నాతో వచ్చీయ్. పెదపాత్రులకి మొరెట్టుకుని గుళ్ళో సాతాని పనో దివిటీల పనో ఏదన్నా ఇిప్పిస్తా’ అంటూ ప్రాధేయపడింది కన్నమ్మ.
‘ఆ దివిటీల పనే నా పానం తీసింది. మద్దిలపాలెం పండక్కి ఆయేళ పోమాకరా అంటే ఇనిపించుకోలేదు సచ్చినోడు. పందిరి అంటించి ఆడనే సచ్చాడు. నావొల్ల కాదులేయ్. ఒగ్గేయ్’ ‘కొండచుట్టే పండగే! తీర్థాల దంక తానాలు చేసి పొద్దుటాలకి వచ్చీయొచ్చు. దారంట ప్రతి పల్లెలో, పాలెంలో చలిది కుండలు, దద్దోనాలు పెడతారు. ఆడతా పాడతా పోయేసి మొక్కి తిరిగొచ్చీద్దాం’
ముత్యాలు మొగుడు అప్పడు గుళ్ళో దివ్వెకోల పట్టేవాడు. మద్దిలపాలెం ఊరి పండగలో చినరడ్డి పోయించిన కల్లు దాగిన మైకంలో ఆడే పందిరి అంటించాడని పంచాయతీ పెద్దలు తీరుమానం చేసారు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. ఏదన్నా పని లేకుంటే బతుకు గడవదు. సాతాని పనికి రోజుకి మూడు కాకిరూకల బత్తెం, గుళ్ళో ప్రసాదం, పానకం. కానీ ఆడు చేసిన తప్పిదానికి జాతర్లో ఆరుగురు చచ్చారు. ఆడికి బదులుగా పని అడిగేటికి మొగం చెల్లదు. ఏటి చేయాలో దిక్కుతోచని ముత్యాలుకి చెల్లెలి మాట సబబే అనిపించింది. సరే పద! అని బయలుదేరింది.
గిరి ప్రదక్షిణం పనులకి తోడు రాజమహేంద్రి ఆస్థానం నుంచి గుడి లెక్కలు చూసేందుకు భోగపరీక్షకుడు (ఆడిటర్) వస్తున్నాడని కబురు వచ్చింది. కొష్టాల లెక్కలు, జీతబత్యాలు, స్వామివారి కానుకలూ కట్నాలే కాక గుడి మాన్యాలు, పశువులు, పాడి ప్రసాదాలు అన్నిటినీ పర్యవేక్షించి మహారాజుకి నివేదించడం అతడి పని. ఏమాత్రం లెక్కతప్పినా ఉద్యోగాలకే ముప్పు. దాంతో మహాపాత్రుడికి క్షణం తీరికలేదు. వియ్యంకుడికి కమ్మ రాస్తానన్న విషయం హడావుడిలో మరిచిపోయాడు. ‘వచ్చేవాడు యముడు! కైలాసనాథ దేశికుడు. శైవుడు! దక్షారామంలో శ్రీగంధం మూడు పుట్ల తేడా వచ్చిందని కోష్టకరణాన్ని తొలగించి గ్రామం నుంచి వెలి వేయించాడు. శివాలయంలోనే అలా చేస్తే మన నిలువుబొట్టని వదులుతాడా?’ బిక్కమొహంతో ఎదురు నిలిచాడు భండారి.
‘మన గుళ్ళో అలాంటి తేడాలకి ఆస్కారం లేదు. మొన్ననేగా చందనోత్సవం తరువాత అన్ని లెక్కలూ చూశాం. అనవసరంగా అధైర్యపడక ఈ పండగ పనులు చూడండి.’ ‘అలా కాదు పాత్రులూ! ఒకటా రెండా? డెబ్భైవేల వశువులు అంటే ఏడొందలకి పైన గొల్లకాపర్లు. కొండ చుట్టూ వెయ్యి గోచరాల పంటపొలాలు అంటే ఐదువేల కాపు కుటుంబాలు. పూలతోటల మాలదాసర్లు, పంచాణం వాళ్ళు, వంటవాళ్ళు, గుళ్ళో పని చేసే సాతానులు, భోగంవీధిలో సానులు... వీళ్ళలో ఏ ఒక్కరు తప్పు చేసినా అది మన తలకి చుట్టుకుంటుంది. ఒకసారి అందరినీ పిలిపించి లెక్కలు మరోసారి విచారిస్తే మంచిది.’
‘సరే అలాగే చేద్దాం! అందరినీ రేపు ఉదయాన్నే పిలిపించండి’ ‘రేపా? మరి తీర్థం స్నానాల వద్ద అన్నదానాలు, ప్రసాదాలు ఎవరు పర్యవేక్షిస్తారు?’ ‘ఆ విషయంలో భయం లేదు. అబ్బాయి నరసింహుడు వచ్చాడుగా! వాడిని నియోగిస్తాను. అరే! అసలు విషయం మరిచాను’ కొడుకు మాట రాగానే వియ్యంకుడికి రాయాల్సిన కమ్మ గుర్తుకొచ్చింది. వియ్యంకుడికి ఉత్తరం రాయటంలో నిమగ్నుడయ్యాడు.
జోడుగుళ్ళలో మొక్కి కొండ చుట్టేందుకు సిద్ధమయ్యారు అక్కాచెల్లెళ్ళు. మొగుడు పోయిన ఒంటరిది! అయినా పసుపంచు పావడా, మందారపు రంగు వల్లెవాటు, అరముడితో బిగువుగా కట్టిన రవికెలో మిడిసిపడే మేని నిగారింపుతో ఉంది ముత్యాలు. ఆ మేని చూసి జోడు కట్టేందుకు పోటీపడే కుర్రకారు ఎకసెక్కాలతో, కొంటె పాటలతో దారి పొడుగునా దాని వెన్నంటే ఉన్నారు.
మూడు యోజనాల (34 కిమీ) అడివిదారి! దారిలో అక్కడక్కడా కాపుల కొష్టాలు, అగ్రహారాలు, జాతరకి వేలాదిగా వచ్చిన భక్తుల కోసం ప్రతి కోసుకకి చలివేంద్రాలు, తాహతుకి తగినట్లు పౌరులు ఏర్పాటు చేసిన పొంగుళ్ళు, పులిహోర, దధ్యోదనం. తాగేందుకు చల్లముంతల్లో మజ్జిగ, పానకం, ఆగిన ప్రతిచోటా పందిళ్ళలో బొమ్మలాటలు, సానివాళ్ళ చిందులు, కథలు చెప్పే భాగోతులు, పాము- తేలుకాట్లకి బెణికిన కీళ్లకి విరిగిన ముళ్ళకి, బొబ్బలెక్కిన అరికాళ్ళకి పసరు కట్లుకట్టే ఆచారులు, శాస్త్రచికిత్స చేసే మంగళ్ళు... ఎంత నడిచినా అలుపే తెలియలేదు. మెట ్లకింద నుండే అప్పన్నకి మొక్కి, పొద్దు పొడిచేలోగా సముద్రతీరం చేరారు. ఎత్తివస్తున్న అలలని తొక్కుతూ ఒకరిపైనొకరు నురగ చల్లుకుంటూ సరసాలతో కేరింతలతో కాలమే తెలియలేదు.
సముద్రపుటొడ్డున భక్తుల కోసం పెద్ద భోజనాల పందిరి. పందిరి కింద వంటవాళ్ళని వడ్డించేవాళ్ళనీ పురమాయిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న నరసింహాచారిని సమీపించారా అక్కాచెల్లెళ్ళు. వంటికి అతుక్కున్న చీరెలో, నడుము దాటే తడిసిన కురులతో మత్స్యకన్యలా వస్తున్న ముత్యాలుపై నుంచి చూపు మరల్చుకోలేక పోయాడు చినసాత్రుడు. ఒక చెవితో దాని చెల్లెలు చెప్తున్న గోడు వింటున్నా అతడి మనసంతా దాని పొందు కోసం ఆరాటపడసాగింది. ఎలా? అని ఆలోచించగా ఉపాయం తట్టింది... రంగసాని! సానిమున్నూరు గణానికి నాయకురాలు. ఇలాంటి విషయాలలో ఆమే సరియైన ఉపాయం చెప్పగలదు! రేపు సాయంకాలం గుడి వెనక నాట్యమండపానికి రావే. అక్కడ ఏ సంగతీ చెబుతాను’ కనులంతా దాని రూపాన్నే నింపుకోని వణికే గొంతుతో చెప్పాడు నరసింహాచారి.
పాతికేళ్ళు గ డిచాయి....
స్థానాధికారి నరసింహాచార్య మహాపాత్రుని నీడలో, రంగసాని శిక్షణలో, అనతికాలంలోనే సానిమున్నూరు గణానికే తలమానికంగా ఎదిగింది ముత్యాలమ్మ. భోగంవీధిలో రెండంతస్తుల మేడ, కళింగంలో నూరెకరాల మాగాణి, పరిచారికలు, మందిమార్బలం... చందనోత్సవంలో ఆమె చెంచులక్ష్మి వేషానికి గజ్జె కడితే ఆ నాట్యం చూసేందుకు కళింగన గరం, రాజమహేంద్రం వంటి నగరాల నుంచి కూడా జనం వస్తారు.
వృద్ధాప్యంలో ఆమె దానం ఇచ్చిన 16 బారువుల (2300 కిలోలు) వెండితో నృత్యమండపానికి తొడుగు వేసిన పంచాణం కంసాలి ప్రతిభని ప్రశంసిస్తూ నరసింహాచార్య మహాపాత్రుడే స్వయంగా ముఖమంటపంలో దానశాసనాన్ని వేయించాడు. ఠి
మహాపాత్రుడు వైఖాసన క్రమంలో వరాహనృసింహుని దేవస్థానాధిపతి. క్షేత్రంలో భండారి, శ్రీకరణం, కోష్టకరణం (కొట్టులెక్కల అధికారి), ఆచార్యుడు, అర్చకులు, బోయలు, గొల్లలు, సానులు గల పరిషత్తులో అతడి మాటంటే వేదవాక్కు. అతడి కొడుకు తిరిగి వచ్చిన సందర్భంలో మహాపాత్రుని ఇంట్లో సందడి అంతింత కాదు. దానికి తోడు కటకమానపు గిరిప్రదక్షిణం కళింగంలోనే పెద్దపండగ.
‘పండగ కాగానే కోడలిని ఇంటికి తెచ్చుకుంటే బాగుంటుంది, ఏమంటారు?’ అడిగింది మహాపాత్రుడి ఇల్లాలు.
‘అవునవును! ఇవాళ మంచిరోజు. శకునాలూ బాగున్నాయి. గుడికి వెళ్ళగానే నీ అన్నకి కమ్మ రాసి శ్రీకూర్మానికి పంపిస్తాను. కార్తీకమాసంలో ముహూర్తం పెట్టి పంపిస్తే మనవాణ్ని శోభనానికి పంపిద్దాం’ ‘మనమూ వెళ్దామండీ. అన్నయ్యనీ వదినెనీ చూసి చాలా నాళ్ళయింది’ ‘పోయిన సంక్రాంతికే గదే వెళ్లావ్? నేనయితే కోడలిని పెళ్ళిలో చూడటమే. ఏడే ళ్ళయింది. గుడి పనులతో క్షణం తీరిక దొరకదు. అయినా ఈసారి తప్పదులే. అప్పగింతలకి మనం లేకుంటే ఎలా?’
మూల కూర్చోని వెక్కివెక్కి ఏడుస్తోంది ముత్యాలు.
‘అక్కా! ఏడ్వమాకే. నువు లానంటే నానెట్టాగే పోయేది?’ పూరింటి వసారా అరుగు మీద బారెడు జడకి మొగలిరేకులు అల్లి, సింగారాన్ని రాగి అద్దంతో చూసుకుని మురిసిపోతూ అడిగింది దాని చెలె ్లలు కన్నమ్మ- ‘బేగా తయ్యరైపో. ఏటంటావ్?’ అంది.
‘ఆడ్ని పొట్టనెట్టుకున్న ఆ దేముణ్నేటికే నాను మొక్కేది? నువె ్వల్లు. నాను లాను’ కొంగుతో మొగం తుడుచుకుంటూ జవాబిచ్చింది ముత్యాలు. ‘నీవో మారు నాతో వచ్చీయ్. పెదపాత్రులకి మొరెట్టుకుని గుళ్ళో సాతాని పనో దివిటీల పనో ఏదన్నా ఇిప్పిస్తా’ అంటూ ప్రాధేయపడింది కన్నమ్మ. ‘ఆ దివిటీల పనే నా పానం తీసింది. మద్దిలపాలెం పండక్కి ఆయేళ పోమాకరా అంటే ఇనిపించుకోలేదు సచ్చినోడు. పందిరి అంటించి ఆడనే సచ్చాడు. నావొల్ల కాదులేయ్. ఒగ్గేయ్’ ‘కొండచుట్టే పండగే! తీర్థాల దంక తానాలు చేసి పొద్దుటాలకి వచ్చీయొచ్చు. దారంట ప్రతి పల్లెలో, పాలెంలో చలిది కుండలు, దద్దోనాలు పెడతారు. ఆడతా పాడతా పోయేసి మొక్కి తిరిగొచ్చీద్దాం’
ముత్యాలు మొగుడు అప్పడు గుళ్ళో దివ్వెకోల పట్టేవాడు. మద్దిలపాలెం ఊరి పండగలో చినరడ్డి పోయించిన కల్లు దాగిన మైకంలో ఆడే పందిరి అంటించాడని పంచాయతీ పెద్దలు తీరుమానం చేసారు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. ఏదన్నా పని లేకుంటే బతుకు గడవదు. సాతాని పనికి రోజుకి మూడు కాకిరూకల బత్తెం, గుళ్ళో ప్రసాదం, పానకం. కానీ ఆడు చేసిన తప్పిదానికి జాతర్లో ఆరుగురు చచ్చారు. ఆడికి బదులుగా పని అడిగేటికి మొగం చెల్లదు. ఏటి చేయాలో దిక్కుతోచని ముత్యాలుకి చెల్లెలి మాట సబబే అనిపించింది. సరే పద! అని బయలుదేరింది.
గిరి ప్రదక్షిణం పనులకి తోడు రాజమహేంద్రి ఆస్థానం నుంచి గుడి లెక్కలు చూసేందుకు భోగపరీక్షకుడు (ఆడిటర్) వస్తున్నాడని కబురు వచ్చింది. కొష్టాల లెక్కలు, జీతబత్యాలు, స్వామివారి కానుకలూ కట్నాలే కాక గుడి మాన్యాలు, పశువులు, పాడి ప్రసాదాలు అన్నిటినీ పర్యవేక్షించి మహారాజుకి నివేదించడం అతడి పని. ఏమాత్రం లెక్కతప్పినా ఉద్యోగాలకే ముప్పు. దాంతో మహాపాత్రుడికి క్షణం తీరికలేదు. వియ్యంకుడికి కమ్మ రాస్తానన్న విషయం హడావుడిలో మరిచిపోయాడు.
‘వచ్చేవాడు యముడు! కైలాసనాథ దేశికుడు. శైవుడు! దక్షారామంలో శ్రీగంధం మూడు పుట్ల తేడా వచ్చిందని కోష్టకరణాన్ని తొలగించి గ్రామం నుంచి వెలి వేయించాడు. శివాలయంలోనే అలా చేస్తే మన నిలువుబొట్టని వదులుతాడా?’ బిక్కమొహంతో ఎదురు నిలిచాడు భండారి. ‘మన గుళ్ళో అలాంటి తేడాలకి ఆస్కారం లేదు. మొన్ననేగా చందనోత్సవం తరువాత అన్ని లెక్కలూ చూశాం. అనవసరంగా అధైర్యపడక ఈ పండగ పనులు చూడండి.’ ‘అలా కాదు పాత్రులూ! ఒకటా రెండా? డెబ్భైవేల వశువులు అంటే ఏడొందలకి పైన గొల్లకాపర్లు. కొండ చుట్టూ వెయ్యి గోచరాల పంటపొలాలు అంటే ఐదువేల కాపు కుటుంబాలు. పూలతోటల మాలదాసర్లు, పంచాణం వాళ్ళు, వంటవాళ్ళు, గుళ్ళో పని చేసే సాతానులు, భోగంవీధిలో సానులు... వీళ్ళలో ఏ ఒక్కరు తప్పు చేసినా అది మన తలకి చుట్టుకుంటుంది. ఒకసారి అందరినీ పిలిపించి లెక్కలు మరోసారి విచారిస్తే మంచిది.’
‘సరే అలాగే చేద్దాం! అందరినీ రేపు ఉదయాన్నే పిలిపించండి’ ‘రేపా? మరి తీర్థం స్నానాల వద్ద అన్నదానాలు, ప్రసాదాలు ఎవరు పర్యవేక్షిస్తారు?’ ‘ఆ విషయంలో భయం లేదు. అబ్బాయి నరసింహుడు వచ్చాడుగా! వాడిని నియోగిస్తాను. అరే! అసలు విషయం మరిచాను’ కొడుకు మాట రాగానే వియ్యంకుడికి రాయాల్సిన కమ్మ గుర్తుకొచ్చింది. వియ్యంకుడికి ఉత్తరం రాయటంలో నిమగ్నుడయ్యాడు.
జోడుగుళ్ళలో మొక్కి కొండ చుట్టేందుకు సిద్ధమయ్యారు అక్కాచెల్లెళ్ళు. మొగుడు పోయిన ఒంటరిది! అయినా పసుపంచు పావడా, మందారపు రంగు వల్లెవాటు, అరముడితో బిగువుగా కట్టిన రవికెలో మిడిసిపడే మేని నిగారింపుతో ఉంది ముత్యాలు. ఆ మేని చూసి జోడు కట్టేందుకు పోటీపడే కుర్రకారు ఎకసెక్కాలతో, కొంటె పాటలతో దారి పొడుగునా దాని వెన్నంటే ఉన్నారు. మూడు యోజనాల (34 కిమీ) అడివిదారి! దారిలో అక్కడక్కడా కాపుల కొష్టాలు, అగ్రహారాలు, జాతరకి వేలాదిగా వచ్చిన భక్తుల కోసం ప్రతి కోసుకకి చలివేంద్రాలు, తాహతుకి తగినట్లు పౌరులు ఏర్పాటు చేసిన పొంగుళ్ళు, పులిహోర, దధ్యోదనం. తాగేందుకు చల్లముంతల్లో మజ్జిగ, పానకం, ఆగిన ప్రతిచోటా పందిళ్ళలో బొమ్మలాటలు, సానివాళ్ళ చిందులు, కథలు చెప్పే భాగోతులు, పాము- తేలుకాట్లకి బెణికిన కీళ్లకి విరిగిన ముళ్ళకి, బొబ్బలెక్కిన అరికాళ్ళకి పసరు కట్లుకట్టే ఆచారులు, శాస్త్రచికిత్స చేసే మంగళ్ళు... ఎంత నడిచినా అలుపే తెలియలేదు. మెట ్లకింద నుండే అప్పన్నకి మొక్కి, పొద్దు పొడిచేలోగా సముద్రతీరం చేరారు. ఎత్తివస్తున్న అలలని తొక్కుతూ ఒకరిపైనొకరు నురగ చల్లుకుంటూ సరసాలతో కేరింతలతో కాలమే తెలియలేదు.
సముద్రపుటొడ్డున భక్తుల కోసం పెద్ద భోజనాల పందిరి. పందిరి కింద వంటవాళ్ళని వడ్డించేవాళ్ళనీ పురమాయిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న నరసింహాచారిని సమీపించారా అక్కాచెల్లెళ్ళు. వంటికి అతుక్కున్న చీరెలో, నడుము దాటే తడిసిన కురులతో మత్స్యకన్యలా వస్తున్న ముత్యాలుపై నుంచి చూపు మరల్చుకోలేక పోయాడు చినసాత్రుడు. ఒక చెవితో దాని చెల్లెలు చెప్తున్న గోడు వింటున్నా అతడి మనసంతా దాని పొందు కోసం ఆరాటపడసాగింది. ఎలా? అని ఆలోచించగా ఉపాయం తట్టింది... రంగసాని! సానిమున్నూరు గణానికి నాయకురాలు. ఇలాంటి విషయాలలో ఆమే సరియైన ఉపాయం చెప్పగలదు! ‘రేపు సాయంకాలం గుడి వెనక నాట్యమండపానికి రావే. అక్కడ ఏ సంగతీ చెబుతాను’ కనులంతా దాని రూపాన్నే నింపుకోని వణికే గొంతుతో చెప్పాడు నరసింహాచారి.
పాతికేళ్ళు గ డిచాయి....
స్థానాధికారి నరసింహాచార్య మహాపాత్రుని నీడలో, రంగసాని శిక్షణలో, అనతికాలంలోనే సానిమున్నూరు గణానికే తలమానికంగా ఎదిగింది ముత్యాలమ్మ. భోగంవీధిలో రెండంతస్తుల మేడ, కళింగంలో నూరెకరాల మాగాణి, పరిచారికలు, మందిమార్బలం... చందనోత్సవంలో ఆమె చెంచులక్ష్మి వేషానికి గజ్జె కడితే ఆ నాట్యం చూసేందుకు కళింగన గరం, రాజమహేంద్రం వంటి నగరాల నుంచి కూడా జనం వస్తారు.
వృద్ధాప్యంలో ఆమె దానం ఇచ్చిన 16 బారువుల (2300 కిలోలు) వెండితో నృత్యమండపానికి తొడుగు వేసిన పంచాణం కంసాలి ప్రతిభని ప్రశంసిస్తూ నరసింహాచార్య మహాపాత్రుడే స్వయంగా ముఖమంటపంలో దానశాసనాన్ని వేయించాడు.
సాయి పాపినేని