మన దేశంలో రాజకీయపక్షాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పత్రికలంటే ప్రాణం. అధికారంలోకి వచ్చాక ఆ పత్రికలే ఏలినవారికి చేదయిపో తాయి. తెలంగాణ పాలకులు సైతం దీనికి మినహాయింపుగా లేక పోవడం అత్యంత విచారకరం ఎన్నిలోపాలున్నా సరే.. ప్రజల గొం తుగా ఉంటున్న పత్రికల పీకనొక్కడానికి పూనుకునేవారు ప్రధాని, కేజ్రీ వాల్, కేసీఆర్ ఎవరైనా సరే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నట్లే లెక్క. తెలంగాణ సచివాలయంలో పత్రికా, ప్రసార మాధ్యమాల పాత్రి కేయుల వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రులు, అధికారులు ఆరోపించగానే మీడియాను దూరం పెట్టాలను కోవడం ఉద్యమ నిర్మాతలకు సబ బేనా? జర్నలిస్టుల పక్షపాతినని, వారికి సకల సౌకర్యాలు కల్పిస్తామనీ ఒక వైపు చల్లని వార్తలు చెబుతూనే, మరో వైపు జర్నలిస్టుల వృత్తిగతమైన విధినే అడ్డుకోవాలని ఆలోచించడం కూడా శోచనీయమే.
మన తెలంగాణ మన మీడియా అంటూ ఆద ర్శాలు పలికిన వారే ఇప్పుడు అన్ని మీడియాలపై ఆంక్షలకు సాహసిం చడం గురివింద గింజనే తలపిస్తుంది. మంత్రులు, ముఖ్య కార్యద ర్శుల స్థాయిలో జరిగే నిర్ణయాలను రిపోర్టు చేయవద్దా? ఏ మంత్రి వ ర్యులు ఏం చేస్తున్నారో వార్తలు పంపించవద్దా. ప్రభుత్వం మీడియాపై ఆంక్షలకు పూనుకుంటే జర్నలిస్టులు ఉద్యమబాట పట్టక తప్పదు.
-రావుల రాజేశం జమ్మికుంట