అనంతపురం: వైఎస్సార్ సీపీ నేత, మాజీ కార్పొరేటర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి పై అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తప్పుబట్టారు. జన్మభూమి కార్యక‍్రమంలో ప‍్రజా సమస్యలపై నిలదీశారన్న అక్కసుతో విజయభాస్కర్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. టీడీపీ నేతల చెప్పుచేతల్లో పోలీసులు పని చేయడం బాధకరమన్న వెంకట్రామిరెడ్డి.. సీఐ, ఎస్సైలకు ఎస్పీ ఆదేశాల కన్నా టీడీపీ ఎమ్మెల్యేల ఆశీస్సులే ముఖ్యమయ్యాయని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరులపై కేసు నమోదు చేయడానికి వెనకడుగు వేస్తున్న పోలీసులు.. వైఎస్సార్‌సీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారన్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు పోలీసులకు కనిపించడం లేదా అని వెంకట్రామిరెడ్డి ప‍్రశ్నించారు.
నగరంలో ఛత్రపతి శివాజీ స్కూల్‌లో గత శుక్రవారం జన‍్మభూమి-మా ఊరు సభ నిర్వహించారు. ఈ క్రమంలోనే డివిజన్‌లో సమస్యలను స్థానికులు సభ దృష్టికి తీసుకొచ‍్చారు. స్థానికునిగా కోగటం కూడా ఒక సమస్య చెప్పగా..45 డివిజన్ కార్పోరేటర్ లక్ష్మిరెడ్డి సమాధానం చెప్పారు. ‘దీనిపై సమాధానం చెప్పడానికి మీరెవరు, మా డివిజన్‌లోని సమస్యపై అధికారులు సమాధానం ఇవ్వాలి’ అని కోగటం ప్రశ్నించారు. ఇలా నిలదీసినందుకు కోగటంపై అక్కడే ఉన్న బంగి సుదర్శన్ ఫిర్యాదు చేశారు.దాంతో కోగటంపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు సెక్షన్లు బనాయించి అధికార పార్టీ మెప్పు పొందడానికి యత్నించారు. కోగటం-బంగిల మధ్య ఎటువంటి వివాదం జరగకపోయినప్పటికీ బంగి ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment