
న్యూఢిల్లీ: విపక్ష మహా కూటమి పేరును యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ)నుంచి ‘ప్రోగ్రెసివ్ పీపుల్స్ అలయన్స్(పీపీఏ)గా మార్చాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. యూపీఏ కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడింది కాబట్టి అదే పేరును కొనసాగిస్తే ఇప్పుడు కూడా కూటమిపై కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించినట్లు అవుతుందని, అందువల్ల పేరు మార్చాలని బీజేపీపై పోరు కోసం ఒక్కటైన విపక్ష పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చాయని సమాచారం.
అన్ని పార్టీలకు సమాన ప్రాతినిధ్యం ఉందన్న అభిప్రాయం కలిగేలా ‘పీపీఏ’ను తెరపైకి తేవాలని కొందరు ప్రతిపాదించారని, ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో జరిగిన విపక్ష పార్టీల నేతల సమావేశంలో ఆ అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment