
గుజరాత్‌లో ప్రచారవాహనమెక్కి రాహుల్‌తో సెల్ఫీ దిగుతున్న ఓ అభిమాని
జంబుసార్: సులభతర వాణిజ్య నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారత ర్యాంకు మెరుగుపడిందంటూ ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్థిక మంత్రి జైట్లీ మధ్య ట్వీటర్ వేదికగా చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ప్రముఖ ఉర్దూ కవి మీర్జా ఘలీబ్ కవితను రాహుల్ ఉటంకిస్తూ జైట్లీని విమర్శిస్తూ ‘సులభతర వాణిజ్య నిర్వహణ విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులేమిటో అందరికీ తెలుసు.
కానీ ప్రపంచ బ్యాంకు నివేదిక చెప్పినట్లుగానే వ్యాపారులంతా సంతోషంగా ఉన్నారనుకుంటూ మీరు భ్రమపడుతున్నారు’ అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా జైట్లీ స్పందిస్తూ యూపీఏ ప్రభుత్వంలోని ‘సులభతర అవినీతి నిర్వహణ’ను తమ ప్రభుత్వం‘సులభతర వాణిజ్య నిర్వహణ’తో భర్తీ చేసిందని గట్టి బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment