Finance Minister Jaitley
-
ఆర్థిక మంత్రిగా మళ్లీ అరుణ్ జైట్లీ బాధ్యతలు
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రిగా తిరిగి అరుణ్‌జైట్లీ బాధ్యతలు స్వీకరించారు. వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం దాదాపు నెలన్నర క్రితం ఆయన అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రైల్వేలు, బొగ్గు వ్యవహారాల శాఖ మంత్రి పియూష్‌గోయెల్ ఆర్థికశాఖ అదనపు బాధ్యతలు నిర్వహించారు. అరుణ్‌జైట్లీ గడచిన ఏడాది కాలంలో రెండుసార్లు అమెరికాకు వైద్య చికిత్సలకోసం వెళ్లారు. ఈ సమయంలో గోయెల్ ఆయన బాధ్యతలను నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్‌ను కూడా గోయెల్ పార్లమెంటు ముందు ఉంచడం గమనార్హం. గత వారమే జైట్లీ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. బాధ్యతలు స్వీకరణ సందర్భంగా జైట్లీ ప్రత్యేకంగా పదవీ ప్రమాణ స్వీకరణ చేయాల్సిన పనిలేదు. -
విచ్చలవిడి రుణాలతో కుదేలైన బ్యాంకులు..
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులు మొండిబకాయిలతో సతమతమయ్యేందుకు 2008 నుంచి 2014 వరకూ విచ్చలవిడిగా రుణాలు ఇవ్వడమే కారణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బ్యాంకులు విచక్షణ లేకుండా రుణాలు జారీ చేస్తుంటే అడ్డుకోవడంలో ఆర్బీఐ విఫలమైనందునే ప్రస్తుతం బ్యాంకింగ్ పరిశ్రమలో ఎన్పీఏ సంక్షోభం నెలకొందన్నారు. ద్రవ్య విధాన నిర్ణేతల స్వతంత్రతపై ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య తీవ్రస్ధాయిలో విభేదాలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం అనంతరం 2008 నుంచి 2014 మధ్య ఆర్థిక వ్యవస్థను కృత్రిమంగా పెంచేందుకు బ్యాంకులను విపరీతంగా రుణాలు ఇవ్వాలని అప్పటి పాలకులు కోరారని ఇండియా లీడర్షిప్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ జైట్లీ పేర్కొన్నారు. ఈ క్రమంలో రుణ వృద్ధి సగటు 14 శాతం కాగా, ఓ ఏడాది అసాధారణంగా 31 శాతానికి ఎగబాకిందన్నారు. బ్యాంకులు అడ్డగోలుగా రుణాలిస్తుంటే ఆర్బీఐ అడ్డుకోలేదన్నారు. మరోవైపు బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించేందుకు ఆర్బీఐకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆచార్య కేంద్రాన్ని కోరారు. స్థూల ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు ఆర్బీఐకి విస్తృత అధికారాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. -
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం శుభవార్త
-
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వాతపెడుతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, దేశీయంగా వాహనదారులకు జేబులకు భారీగా చిల్లు పడుతోంది. కేవలం క్రూడాయిల్ ధరలే కాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పన్నుల వల్లే ఈ మేర పెట్రోల్, డీజిల్ ధరలు కాకపుట్టిస్తున్నాయని విపక్షాలు, వాహనదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ధరలు పెరుగుతుండటంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. అటు విపక్షాలు, ఇటు వాహనదారుల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్లతో, దిగొచ్చిన కేంద్రం ఎట్టకేలకు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లీటరు పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని రూ.1.50 తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అంతేకాక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా లీటరు పెట్రోల్, డీజిల్ ధరను రూపాయి తగ్గిస్తున్నట్టు తెలిపారు. దీంతో మొత్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.2.50 తగ్గాయి. తగ్గించిన ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని జైట్లీ పేర్కొన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో, రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను రూ.2.50 తగ్గించాలని అరుణ్‌జైట్లీ ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా పెరిగాయని, బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 86 డాలర్లను దాటిందని మంత్రి అన్నారు. దీంతో కరెన్సీ మార్కెట్‌తో పాటు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం పడిందని జైట్లీ అన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను తీసుకుందని, కానీ అంతర్జాతీయ అంశాలు భారత మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయన్నారు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో రూ.21,000 కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లనుందని జైట్లీ తెలిపారు. డీజిల్, పెట్రోల్ ధరలను డీరెగ్యులేషన్ చేయాలని తాము భావించడం లేదని జైట్లీ చెప్పారు. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ పెరగడం, దేశీయంగా రూపాయిని కూడా భారీగా కుప్పకూల్చుతుంది. రూపాయి ఎఫెక్ట్, చమురు ధరల సెగ స్టాక్ మార్కెట్లను సైతం అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు జైట్లీ ప్రకటించడంతో, వెంటనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్లు నష్టాల బాట పట్టాయి. -
‘ఈజ్ ఆఫ్ బిజినెస్’ ఓ భ్రమ
జంబుసార్: సులభతర వాణిజ్య నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారత ర్యాంకు మెరుగుపడిందంటూ ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్థిక మంత్రి జైట్లీ మధ్య ట్వీటర్ వేదికగా చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ప్రముఖ ఉర్దూ కవి మీర్జా ఘలీబ్ కవితను రాహుల్ ఉటంకిస్తూ జైట్లీని విమర్శిస్తూ ‘సులభతర వాణిజ్య నిర్వహణ విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులేమిటో అందరికీ తెలుసు. కానీ ప్రపంచ బ్యాంకు నివేదిక చెప్పినట్లుగానే వ్యాపారులంతా సంతోషంగా ఉన్నారనుకుంటూ మీరు భ్రమపడుతున్నారు’ అని ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా జైట్లీ స్పందిస్తూ యూపీఏ ప్రభుత్వంలోని ‘సులభతర అవినీతి నిర్వహణ’ను తమ ప్రభుత్వం‘సులభతర వాణిజ్య నిర్వహణ’తో భర్తీ చేసిందని గట్టి బదులిచ్చారు. -
ఏకాభిప్రాయంతోనే జీఎస్టీ ఆమోదం
ఆర్థిక మంత్రి జైట్లీ ఆశాభావం న్యూఢిల్లీ: ఏకాభిప్రాయం ద్వారానే జీఎస్టీ బిల్లులు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సదస్సు తర్వాత పార్టీ ఎంపీల్ని ఉద్దేశించి మాట్లాడారు. అన్ని రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్న జీఎస్టీ మండలిలో సుదీర్ఘంగా చర్చించాకే బిల్లుల్ని రూపొందించామన్నారు. సవరణలు చేయాల్సిందే: కాంగ్రెస్ ప్రస్తుత రూపంలో జీఎస్టీ బిల్లుల్ని అంగీకరించమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలు జీఎస్టీపై చర్చించారు. జీఎస్టీపై ప్రజల ఆందోళనల్ని సభలో లేవనెత్తాలని, తప్పకుండా అవసరమైన సవరణలు కోరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. -
పరీకర్ విధానాలే కొనసాగుతాయి: జైట్లీ
న్యూఢిల్లీ: రక్షణ మంత్రిగా తాను అదనపు బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆశాఖ మంత్రిగా మనోహర్ పరీకర్ అమలు చేసిన విధానాలనే కొనసాగిస్తానని ఆర్థికమంత్రి జైట్లీ స్పష్టం చేశారు. రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మనోహర్ పరీకర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్తున్న నేపథ్యంలో ఆశాఖ బాధ్యతలను మంగళవారం అరుణ్‌జైట్లీ చేపట్టారు. గతంలోనూ 2014 మే నుంచి నవంబర్ వరకు జైట్లీ రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పరీకర్ తన విధుల్ని ఎక్కడ విడిచి పెట్టారో అక్కడి నుంచి తాను కొనసాగిస్తానన్నారు. -
‘ప్యాకేజీ’పై బీజేపీ ప్రచారం
-
‘ప్యాకేజీ’పై బీజేపీ ప్రచారం
రాష్ట్రానికి రానున్న కేంద్ర మంత్రులు.. నెలలో 3 ప్రాంతాలు.. 3 సభలు సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాకు బదులు అందుకు సమానంగా ఆర్థిక సహాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ’ అంశాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది. రానున్న నెల రోజుల్లోగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగసభలు నిర్వహించాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయించింది. ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో తిరుపతి, కోస్తాలో గుంటూరు లేదంటే విజయవాడలో ఈ సభలను నిర్వహించనున్నారు. ప్రాంతాలవారీగా జరిగే ఒక్కొక్క సభకు పార్టీకి చెందిన ఒక్కో కేంద్రమంత్రిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తారు. విశాఖ సభకు జైట్లీ హాజరు కానున్నారని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి యడ్లపాటి రఘునాథబాబు ‘సాక్షి’కి తెలిపారు. బహిరంగసభల తేదీల్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేశాక కూడా.. ఇంకా ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీడీపీ పెద్దలు ఎందుకు చెబుతున్నారో వారినే అడగాలన్నారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రానికి ‘హోదా’ ఇచ్చే అవకాశం లేదన్నారు. -
ఇక్కడ సంపాదించే ఇన్వెస్టర్లు... ఇక్కడే పన్నులు చెల్లించాలి..
* మారిషస్‌తో తాజా డీల్‌తో ఎఫ్‌డీఐలు తగ్గవు... * ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టీకరణ న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులపై సంపాదించే ఇన్వెస్టర్లు ఎవరైనాసరే ఇక్కడ పన్నులు చెల్లించాల్సిందేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పన్ను ఎగవేతల నిరోధానికిగాను మారిషస్‌తో తాజాగా సవరించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీని ప్రకారం మారిషస్ ద్వారా భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై ఇన్వెస్టర్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మూలధన లాభాల పన్ను(క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఒప్పందం కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) తగ్గుతాయన్న ఆందోళనలను జైట్లీ కొట్టిపారేశారు. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు తగినంత పటిష్టంగా ఉంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం పన్ను ప్రోత్సాహకాలు ఇతరత్రా రాయితీలు వంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. మారిషస్‌తో తాజా డీల్ కారణంగా ఇన్వెస్టర్లు తమ బేస్(పెట్టుబడులకు మూల కేంద్రం)ను ఇతర పన్ను స్వర్గధామ దేశాలకు తరలిస్తాయని భావించడం లేదు’ అని జైట్లీ తెలిపారు. దేశీయ వినిమయానికి బూస్ట్... కాగా, మారిషస్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందం(డీటీఏఏ)లో సవరణల కారణంగా రౌండ్ట్రిప్పింగ్(నిధులను ఇతర దేశాల ద్వారా తీసుకురావడం)కు అడ్డుకట్టపడుతుందని జైట్లీ చెప్పారు. తద్వారా దేశీయంగా వినిమయానికి(కన ఊతమిచ్చేందుకు దోహదపడుతుందని జైట్లీ వివరించారు. ‘పన్ను స్వర్గధామ దేశాలను పన్ను ఎగవేతలకు ఆవాసంగా మార్చుకుంటున్న ఇన్వెస్టర్లకు ఆయా దేశాలతో ఉన్న ఒప్పందాలను సవరించడం ద్వారా చెక్ చెప్పనున్నాం. ఈ చర్య కారణంగా స్టాక్ మార్కెట్లలో కొంత కుదుపులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. రానున్న కాలంలో మార్కెట్ల గమనం భారత్ ఆర్థిక వ్యవస్థకు స్వతహాగా ఉన్న బలం ఆధారంగా కొనసాగేందుకు దోహదం చేస్తుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. పన్నుల విధింపు అనేది దశలవారీగా ఉంటుందని.. అందువల్ల విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయన్న ఆందోళలు అనవసరమని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. కాగా, మారిషస్‌లోని తమ సంస్థల ద్వారా భారత్‌లో పెట్టుబడులు పెడుతున్న కంపెనీల విషయంలో ఈ తాజా సవరించిన ఒప్పందం వల్ల మరింత పారదర్శకతకు ఆస్కారం ఉంటుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. మూడో వంతు ఎఫ్‌డీఐలు మారిషస్ నుంచే... ప్రస్తుతం భారత్‌కు వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా మారిషస్ రూట్ ద్వారానే వస్తున్నాయి. 1991లో భారత్ ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు దశాబ్దం ముందే మారిషస్‌తో డీటీఏఏ కుదిరింది. విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించడమే ఈ డీల్ ముఖ్యోద్దేశం. గడిచిన 15 ఏళ్లలో భారత్‌కు వచ్చిన 278 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.19 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐల్లో మూడోవంతు మారిషస్ రూట్లోనే రావడం గమనార్హం. మారిషస్ డీటీఏఏ సవరణ నేపథ్యంలో సింగపూర్‌తో ఉన్న ఇదేవిధమైన ఒప్పందాన్ని కూడా సవరించే అవకాశం ఉంది. 2015 ఏడాది ఏప్రిల్-డిసెంబర్ కాలంలో భారత్‌కు వచ్చిన 29.4 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలలో ఈ రెండు దేశాల ద్వారా మొత్తం 17 బిలియన్ డాలర్లు లభించడం విశేషం. -
మర్యాదగా బకాయిలు కట్టండి..
♦ లేదంటే కఠిన చర్యలు తప్పవు... ♦ కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు ♦ ఆర్థిక మంత్రి జైట్లీ హెచ్చరిక న్యూఢిల్లీ: బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా భారీ మొత్తంలో రుణాలను ఎగవేసిన బడా కార్పొరేట్ గ్రూపులు మర్యాదగా తమ బకాయిలను చెల్లిస్తే మంచిదని.. లేదంటే బ్యాంకులు, దర్యాప్తు సంస్థలు చేపట్టే తీవ్రమైన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానంగా విజయ్ మాల్యా వంటి ఎగవేతదారులను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వ్యక్తిగత కేసుల గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. అయితే, మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తరహా బడా కార్పొరేట్ సంస్థలు, గ్రూప్‌లు బ్యాంకులకు మర్యాదగా తమ బకాయిలను కట్టాల్సిందే. బ్యాంకుల వద్ద మాల్యా గ్రూప్‌నకు చెందిన ఇతర కంపెనీల ఆస్తులు తనఖాలో ఉన్నాయి. ఒకవేళ ఆయన గనుక బకా యిలు చెల్లించపోతే బ్యాంకులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాయి. ఈ మొత్తం ఉదంతంపై సంబంధిత దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారణ జరుపుతున్నాయి కూడా’ అని జైట్లీ పేర్కొన్నారు. ఎస్బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియంకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా వడ్డీతో కలిపి రూ. 9,000 కోట్లకు పైగానే బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మాల్యా ఈ నెల 2న దేశం విడిచి బ్రిటన్‌కు పరారైన సంగతి తెలిసిందే. అధిక వడ్డీరేట్లతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది... భారత్‌లో వడ్డీరేట్లు చాలా అధికంగా ఉన్నాయని.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలోకి జారిపోయే ప్రమాదం ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. పీపీఎఫ్ ఇతర చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌లపై వడ్డీరేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆర్థిక మంత్రి సమర్థించుకున్నారు. ‘ఇప్పుడు చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌లలో డిపాజిట్ రేట్లు 8.7% వరకూ ఉన్నప్పటికీ... పన్ను మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవానికి ఈ రేట్లు 12-13% మేర ఉన్నట్లు లెక్క. దీని ప్రకారం చూస్తే రుణాలపై వడ్డీరేటు ఇప్పుడు 14-15%గా ఉంది. ఈ స్థాయిలో రుణాలపై వడ్డీరేటు ఉంటే ప్రపంచంలోనే అత్యంత మందకొడి ఆర్థిక వ్యవస్థగా మారే ప్రమాదం ఉంది’ అని వ్యాఖ్యానిం చారు. కాగా, ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్) విత్డ్రాయల్స్పై పన్ను విధింపు ప్రతిపాదపై స్పందిస్తూ.. ప్రజలు తాము దాచుకున్న మొత్తాన్నంతా ఖర్చుచేసేయకుండా, పన్నుల్లేని పెన్షన్ పథకాల్లోకి నిధులను మళ్లించే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేశామని చెప్పారు. ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో కేంద్రం దీన్ని విరమించుకున్న సంగతి తెలిసిందే. -
ముద్రా రుణ లక్ష్యం రూ.1.22 లక్షల కోట్లు
♦ ఇప్పటి వరకూ రూ.24 వేల కోట్ల రుణ పంపిణీ ♦ మెగా రుణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్థికమంత్రి జైట్లీ న్యూఢిల్లీ : చిన్న మధ్య తరహా వ్యాపారాలకు ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి (మార్చి 2016) రూ.1.22 లక్షల కోట్ల రుణ పంపిణీ లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన నాటి నుంచి ఈ యోజన కింద ఇప్పటికి 37 లక్షల మంది చిన్న వ్యాపారస్తులకు దాదాపు రూ.24,000 కోట్ల రుణ పంపిణీ జరిగింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ విషయాలను వెల్లడించారు. ఈ రుణ పంపిణీ ద్వారా లక్షలాది ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నది కేంద్రం ప్రధాన లక్ష్యమని వివరించారు. దీనదయాళ్ ఉపాధ్యాయ 99వ జయంతిని పురస్కరించుకుని పీఎంఎంవై కింద వారం రోజుల మెగా రుణ కార్యక్రమాన్ని అరుణ్‌జైట్లీ శుక్రవారం ప్రారంభించారు. రుణం సౌలభ్యం అందక ఇబ్బంది పడుతున్న చిన్న పరిశ్రమలకు చేయూతను ఇవ్వడానికి ముద్రా (చిన్న పరిశ్రమల అభివృద్ధి, రీఫైనాన్స్ సంస్థ) యోజన ఆవిష్కరణ జరిగింది. నేటి నుంచీ వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు ఈ రుణ పంపిణీకి సంబంధించి మెగా క్యాంప్‌ను నిర్వహించనున్నాయి. తగిన వడ్డీరేటుకు రుణం అందుకోవడం ద్వారా చిన్న తరహా వ్యాపారస్తులు స్వయం సంపదను ఆర్జించడానికి ఈ పథకం దోహదపడుతుందని జైట్లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు ముద్రా పథకం కింద 1.75 కోట్ల చిన్న వ్యాపారులకు రుణం అందజేయాలన్నది కేంద్ర లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి పలువురు వ్యాపారస్తులకు రుణ మంజూరీ లేఖలను అందజేశారు. శిశు (రూ.50,000 వరకూ) కిశోర్ (రూ.50,000-రూ.5 లక్షల వరకూ), తరుణ్ (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ) పేర్లతో మూడు కేటగిరీల కింద ముద్రా యోజన కింద రుణాలు మంజూరవుతాయి. కాగా, ఇప్పటికి ముద్రా కార్యక్రమం కింద 1.24 లక్షల కొత్త అకౌంట్లు ప్రారంభించి... రూ.938 కోట్ల రుణ పంపిణీ జరిపినట్లు పీఎన్బీ ఎండీ ఉషాసుబ్రమణ్యం తెలిపారు. -
జీఎస్టీ, భూసేకరణ బిల్లులకు మద్దతివ్వండి..
వృద్ధి, పెట్టుబడుల జోరుకు ఈ చట్టాలు తప్పనిసరి... {పతిపక్షాలకు ఆర్థిక మంత్రి జైట్లీ విజ్ఞప్తి న్యూఢిల్లీ : పెండింగులో ఉన్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), భూసేకరణ బిల్లులు ఆమోదం పొందేందుకు మద్దతివ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వృద్ధి, పెట్టుబడులకు ఊతమివ్వడంతోపాటు భారీగా ఉద్యోగాల సృష్టి, పేదరిక నిర్మూలనకు ఈ రెండు చట్టాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. ఫేస్బుక్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లలిత్ మోదీ స్కామ్ తీవ్ర ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ స్కామ్‌తో ఇద్దరు సీనియర్ బీజేపీ నేతల(సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే)కు సంబంధాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా, ఇతర విపక్షాలన్నీ మోదీ సర్కారుపై పార్లమెంటులో ధ్వజమెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల 13 వరకూ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కాగా, జీఎస్టీ బిల్లు ప్రస్తుతం రాజ్యసభ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉండగా.. భూసేకరణ బిల్లుపై పార్లమెంటు జాయింట్ కమిటీ సంప్రతింపులు జరుపుతోంది. వర్షాకాల సమావేశాల్లోనే రెండు కమిటీలూ తమ నివేదికను అందించే అవకాశం ఉంది. సామాజిక సర్వేపై... గ్రామీణ భారతావనిలో ప్రజల జీవన పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయంటూ తాజా సర్వేలో వెల్లడైన అంశాలపై జైట్లీ మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి రేటును 8-10 శాతానికి పెంచడం కోసం తమ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. జీఎస్టీద్వారా ఏకీకృత మార్కెట్‌ను సృష్టించడం, వ్యాపారాలకు సానుకూల పరిస్థితుల కల్పన, పెట్టుబడులకు మెరుగైన వాతావరణం వంటివి ఇందులో ఉన్నాయని చెప్పారు. పేదలు, సామాజిక పథకాలపై ఆధారపడుతున్నవారికి చేదోడుగా నిలవాలంటే వృద్ధిరేటు పెంపు, ఆర్థిక సంస్కరణలే శరణ్యమన్నారు. బ్రిక్స్ బ్యాంక్ తొలి సమావేశానికి జైట్లీ... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు రష్యా రాజధాని మాస్కోకు పయనమవుతున్నారు. బ్రిక్స్ బ్యాంక్(న్యూ డెవలప్మెంట్ బ్యాంక్) పాలక మండలి తొలి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆతర్వాత మంగళవారంనాడు బ్రిక్స్ దేశాల(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) ఆర్థిక మంత్రుల సమావేశానికి కూడా జైట్లీ హాజరవుతారు. ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలోని ఉఫా నగరంలో నిర్వహిస్తున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జైట్లీ కూడా పాల్గొంటారు. బ్రిక్స్ బ్యాంకుకు ప్రారంభ నిధులను సమకూర్చే అంశంపై సదస్సులో ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు. ఈ బ్యాంకుకు తొలి సారథిగా భారతీయుడైన ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ ఎంపికైన సంగతి తెలిసిందే. -
విదేశీ ఇన్వెస్టర్లకు ‘మ్యాట్’ ఊరట
ఫైనాన్స్ బిల్లు-2015పై చర్చలో ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టత... ⇒ ఐటీఆర్ ఫారాలను మరింత సరళం చేస్తామని హామీ.. ⇒ ఎఫ్ఐఐలపై రెట్రోస్పెక్టివ్ పన్ను ⇒ అంశం సుప్రీంకోర్టులో ఉందని వెల్లడి... ⇒ లోక్‌సభలో మూజువాణి ఓటుతో ⇒ ఫైనాన్స్ బిల్లుకు ఆమోదం.. న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాస్త ఊరటనిచ్చారు. కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) విధింపు విషయంలో కొన్ని రకాల ఆదాయాలను మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ఎఫ్ఐఐలపై ఇక మ్యాట్ ఉండదని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా వివాదాస్పదమైన 14 పేజీల ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్) ఫారం స్థానంలో పూర్తిగా సరళీకరించిన కొత్త ఫారాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు. గురువారం లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు-2015పై చర్చ అనంతరం జైట్లీ సమాధానమిస్తూ ఈ విషయాలను వెల్లడించారు. ఇక ప్రధాన మంత్రి సామాజిక భద్రత పథకాలకు జరిపే చెల్లింపులను సేవల పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు కూడా చెప్పారు. ముడి పట్టు, ఇనుప ఖనిజం, రబ్బరులపై పరోక్ష పన్నుల్లో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయవ్యయ పద్దులు, పన్నులు ఇతరత్రా ప్రతిపాదనలతో కూడిన ఈ ఫైనాన్స్ బిల్లుకు... ఆ తర్వాత లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదముద్ర పడింది. కాగా, భూసేకరణ బిల్లు వంటి కీలక సంస్కరణల విషయంలో ప్రతిపక్షాలు సహకరించాలని జైట్లీ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిస్థితులను అనువుగా మలచుకొని వృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ చర్యలు చాలా అవసరమని ఆయన చెప్పారు. మ్యాట్ మినహాయింపులు ఇలా... గడిచిన మూడేళ్లకు సంబంధించి మూలధన లాభాలపై(ఈ మార్చి 31 వరకూ) ఎఫ్ఐఐలు 20% మ్యాట్ బకాయిలను చెల్లించాలంటూ రెవెన్యూ విభాగం ఇటీవలే డిమాండ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. అయితే, దీనిపై ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలు వ్యక్తం కావడంతో కేంద్రం తాజాగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. షేర్ల లావాదేవీలు, వడ్డీల ద్వారా విదేశీ సంస్థలకు వచ్చిన ఆదాయాలపై అదేవిధంగా సాంకేతిక సేవలకుగాను ఆర్జించే రాయల్టీలు, ఫీజులను మ్యాట్ నుంచి మినహాయిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. సాధారణ పన్ను రేటు 18.5% కంటే దిగువనున్న కేసులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందన్నారు. అయితే, ఎఫ్ఐఐ(వీరినే ఎఫ్‌పీఐలుగా వ్యవహరిస్తారు)లకు పాత బకాయిలకు(రెట్రోస్పెక్టివ్) సంబంధించి పన్నులపై జైట్లీ ఎలాంటి ఊరటనూ కల్పించకపోవడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎఫ్ఐఐలకు మ్యాట్ ఉండదని.. పాత బకాయిల విషయం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని జైట్లీ వివరించారు. ఐటీఆర్‌ల విషయానికొస్తే... ⇒ కొత్తగా తీసుకొచ్చిన ఐటీఆర్ ఫారంలో అసెస్సీలు బ్యాంక్ ఖాతాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాలంటూ ఐటీ శాఖ కొత్త నిబంధనలను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై తీవ్ర వ్యతిరేకతలు, విమర్శలు వ్యక్తం కావడంతో అత్యంత సులువైన రీతిలో కొత్త ఫారాన్ని త్వరలోనే తీసుకొస్తామని జైట్లీ ఈ వివాదానికి తెరదించారు. ⇒ తక్కువ గ్రేడ్ ఇనుప ఖనిజ ఎగుమతులు(గోవా నుంచి) పెంచేందుకు వీలుగా ఎగుమతి సుంకాన్ని ఇప్పుడున్న 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ⇒ ఇక సహజ రబ్బరుపై బేసిక్ దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 25 శాతానికి పెంపు. ⇒ ప్రైవేటు రంగ డిఫెన్స్ పరికరాల తయారీ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లతో సమాన స్థాయిని కల్పించడం కోసం డిఫెన్స్ పీఎస్‌యూలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులకు కల్పిస్తున్న ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఉపసంహరణ. ఆర్బీఐ అధికారాలకు కోతపై వెనక్కి... రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అధికారాలకు కోత విషయంలో మోదీ సర్కారు వెనక్కి తగ్గింది. ప్రభుత్వ రుణ పత్రాల(బాండ్లు) నిర్వహణను ఆర్బీఐ నుంచి విడదీసి ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించాలన్న ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కనబెట్టింది. ప్రభుత్వ రుణ నిర్వహణ ఏజెన్సీ(పీఎండీఏ) ఏర్పాటు ప్రతిపాదనను ఫైనాన్స్ బిల్లు-2015 నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు లోక్ సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. అయితే, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఒక ప్రత్యేక రుణ నిర్వహణ ఏజెన్సీ నెలకొల్పేందుకు తగిన రోడ్‌మ్యాప్ తయారు చేసేందుకు ఆర్బీఐతో సంప్రతింపులు జరపనున్నట్లు ఆయన చెప్పారు. -
నోరు విప్పనేల? గుట్టు చెప్పనేల?
టెలివిజన్ ప్రజాసామ్యం పార్టీలను ఇరకాటాల్లోకి తోసేసే పగుళ్ల మయం. రోజుకు సరిపడే సౌండ్ బైట్లకు అవసరమయ్యేటన్ని డెసిబుల్స్ శబ్దాలతో అది పర్యవసానాల ఆలోచనే రాకుండా ముంచెత్తుతుంది. కాబట్టే ప్రత్యర్థిపై దాడి అతి సునాయసంగా వారికే బెడిసికొడుతుంటుంది. స్విస్ బ్యాంకు ఖాతాలపై ఆర్థిక మంత్రి జైట్లీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన దాడి విషయంలో అదే జరిగింది. ఆయనకు దాచుకోవాల్సిందేదీ లేదని, కాపాడాల్సిన వాళ్లెవరూ లేర ని కాంగ్రెస్ విస్మరించింది. స్విస్ బ్యాంకులు వెల్లడి చేయబోయే ఏమంత గౌరవప్రదం కాని జాబితాలోతమ పార్టీకి చె ందిన గొప్ప వ్యక్తులు ఉన్నారని దానికి తెలుసు. కాబట్టే యూపీఏ ప్రభుత్వం స్విస్ ఖాతాల వెల్లడి సమస్యను ఎక్కడికీ చేర్చని నత్తనడక దారి పట్టించింది. మౌనంగా భరించడమే బాధను అనుభవించే అత్యుత్తమ మార్గమంటూ మతం చాలానే బోధిస్తుంది. దురదృష్టవశాత్తూ మౌనం ప్రజాస్వామ్య సహజ లక్షణం కాదు. ఎన్నికల్లో ఓడిన వారి మొహంలో బాధ కొట్ట వచ్చినట్టు కనబడుతున్నప్పుడు సైతం మౌనం వహించడం అంతగా కనబడదు. మరులు గొలిపే టెలివిజన్ ప్రలోభపెడుతుండగా నోరు విప్పాలా, వద్దా? అనే సందిగ్ధం మరింత పెరుగుతుంది. టీవీ ఎప్పుడూ మాట్లాడమనే శాసిస్తుంది. చట్ట విరుద్ధమైన స్విస్ బ్యాంకు ఖాతాలపై కాంగ్రెస్ మౌనం వహించడమే ఆ పార్టీ ప్రయోజనాలకు తగిన అత్యుత్తమమైన పని అయి ఉండేది. కానీ అందుకు విరుద్ధంగా అది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా మీడియా దాడిని చేపట్టింది. జైట్లీకి దాచుకోవాల్సినదిగానీ, కాపాడాలని ఆసక్తి చూపా ల్సిన వాళ్లు గానీ లేరు. ఈ సామాన్యమైన విషయాన్ని ఆ పార్టీ, దాని మద్దతుదార్లు విస్మరించారు. భారతీయుల స్విస్ ఖాతాల సమస్యపై యూపీఏ ప్రభుత్వం స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో ఒక ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాని ప్రకారం మన ప్రభుత్వం చార్జిషీట్లను దాఖలు చేసిన తర్వాత మాత్రమే స్విస్ బ్యాంకులు ఆ భారతీయ ఖాతాదార్ల పేర్లను వెల్లడించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం సృష్టించిన ఈ సాంకేతికపరమైన అడ్డంకి కారణంగా స్విస్ ఖాతాదార్ల పేర్లను వెల్లడి చేయడం కేవలం కొంత సమయం పట్టే ప్రక్రియ మాత్రమే. స్విస్ బ్యాంకులు వెల్లడి చేయబోయే ఏమంత గౌరవప్రదం కాని ఆ జాబితాలో తమ పార్టీకి చెందిన గొప్ప వ్యక్తులు ఉన్నారని కాంగ్రెస్‌కు తెలుసు. కాబట్టే అది తన మోసకారితనానికి ఈ సాంకేతిక అడ్డంకిని నిరంతర రక్షణకవచంగా వాడుకుంది. నల్లధనం సమస్యను బహు లాఘవంగా దాటవేయడం కోసం యూపీఏ ఓ అంతుబట్టని వ్యూహాన్ని అనుసరించింది. స్విస్ ఖాతాదార్ల పేర్లను వెల్లడించే ప్రక్రియను అది ఎక్కడికీ చేర్చని ఓ నత్తనడక దారి పట్టించింది. తద్వారా 2014 సార్వత్రిక ఎన్నికల వరకు గడువును సంపాదించడమే దాని ఏకైక లక్ష్యం. దిగ్భ్రాంతికరమైన ఏ మాయో జరిగి కాంగ్రెస్ గనుక ఈ ఏడాది ఎన్నికల్లో ఏదో ఒక అతుకుల బొంత కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి తగినన్ని సీట్లను దక్కించుకుని ఉంటే... ఆ నత్తనడక దారి కూడా మటుమాయమై ఉండేది. నల్లధనం బందిపోట్లు నవ్వులు చిందిస్తూ స్విస్ బ్యాంకుల బాట పట్టేవారు. అందుకు నిదర్శనం కావాలంటే, స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు వెల్లడించిన ఒక వాస్తవాన్ని ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక ఈ నెల 22న ప్రచురించింది. దాన్ని చూడండి: ‘‘స్విస్ నేషనల్ బ్యాంకు తాజా సమాచారం ప్రకారం స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాల్లోని డబ్బు 2013లో 40 శాతం పెరిగింది. 2012లో 134 వందల కోట్ల స్విస్ ఫ్రాంకులుగా (రూ.9,514 కోట్లు) ఉన్న ఆ డబ్బు 2013లో దాదాపు రెండు వందల కోట్ల స్విస్ ఫ్రాంకులకు (రూ. 14,000 కోట్లు) చేరింది.’’ హఠాత్తుగా ఇలా చట్ట విరుద్ధ మార్గాల్లో స్విస్ ఖాతాల్లోని నల్లధనం రూ. 4,500 కోట్ల హైజంప్ చేయడానికి కారణమేమిటి? అక్రమార్జనాపరుల డబ్బులతో నిండిన బ్యాంకుల నుండి మాత్రమే వచ్చే రాబడిపై బతికే జలగల్లాంటి చిన్న చిన్న ద్వీప దేశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక నేరాల వల్ల అత్యధికంగా లబ్ధిపొందేవి అవే. అలాంటి చోట్లకు ఇంకెంత డబ్బు తరలిపోయిందో మనకు తెలియదు. తాము ఖాతాదార్లకు చేసిన ప్రమాణాన్ని పాటిస్తున్నామనే సాకుతో ఆ బ్యాంకులు తమ వద్ద డిపాజిట్ చేస్తున్న డబ్బు ఎక్కడిదని అడగవు. మన దేశం నుండి డబ్బును బయటకు తరలించింది ఎవరో విద్యావంతులమైన మనం తేలికగానే ఊహించగలం. ఇందులో కొంత భాగం వ్యాపారస్తులు పంపినదై ఉంటుంది. కానీ 2013 వ్యాపారపరంగా వికాసాన్ని చవి చూసిన సంవత్సరమేమీ కాదు. పైగా తీవ్ర ఆర్థిక క్షీణత కనిపించింది. అయితే ఒక రంగం మాత్రం భారీ గెంతు వేసి మరీ వృద్ధి చెందింది... అది అవినీతి. ఈ క్రీడలో పెద్ద పెద్ద ఆటగాళ్లంతా అధికార వర్గ రాజకీయవేత్తలే. 2014 సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు 2013 సంవత్సరం ముగియడమనే విషయానికి ప్రాధాన్యం ఉంది. చలి కాలం వచ్చేసరికే పూర్తిగా గుడ్డివాళ్లయితే తప్ప రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి గురికానున్నదని అందరికీ సుస్పష్టంగా తెలుసు. ఇంకా ఏమైనా అనుమానాలు మిగిలి ఉంటే అవి కూడా సెప్టెంబర్‌లో నరేంద్ర మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో, ఆయన సభలకు ప్రజలు చరిత్రాత్మక స్థాయిలో విరగబడు తుండటంతో మటుమాయమై పోయి ఉంటాయి. యూపీఏ ప్రభుత్వంతో కుమ్మక్కు, భాగస్వామ్యాల సువర్ణ దశాబ్దం వేగంగా ముగింపునకు వస్తోందని కేటుగాళ్లంతా అప్పుడే గ్రహించారని, తమ అక్రమార్జనను స్విస్ (ఇంకా అలాంటి ఇతర) ఖాతాలకు బదలాయించడం ప్రారంభించారని నా అనుమానం. ఈ దోపిడీ సంపదను పట్టుకోడానికి నరేంద్ర మోదీ ఈ నాలుగు నెలల్లో, కాంగ్రెస్ పదేళ్లలో చేసిన దానికంటే ఎక్కువే చేశారు. ‘‘నేను దొంగతనం చేయను, ఎవరు దొంగతనం చేయడాన్నీ అనుమతించను’’ అంటూ ప్రధాని ఎలాంటి అస్పష్టతకు తావులేని విధంగా తమ ప్రభుత్వానికి ఒక నైతిక రేఖను గీశారు. తద్విరుద్ధంగా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ‘‘సంకీర్ణం ఒత్తిడులు’’ సాకుతో తన మంత్రి వర్గంలోని దొంగలు దేశాన్ని దోచేస్తుంటే మరో దిక్కుకు చూస్తూ కూచున్నారు. ఎంత తక్కువ చేసి చూసినా గానీ ఇలాంటి సాకును చూపడం సిగ్గుచేటుతనమే. అతి పలచటి ఈ ముసుగులో నమ్మశక్యం కానంతటి పెద్ద మొత్తాల్లో దొంగిలించిన సొత్తు దేశం బయటకు దాటించేశారు. దేశం నుండి ఎంత మొత్తం సంపద ఇలా మటుమాయమైందో కచ్చితంగా అంచనా కట్టడం దాదాపు అసాధ్యమే. కానీ వాషింగ్టన్కు చెందిన ‘గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ’ సంస్థ 1947 నుండి తరలిపోయిన సంపద మొత్తాన్ని 462 వందల కోట్ల డాలర్లుగా లేదా రూ. 29 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఇందులో అత్యధిక భాగం ఇటీవలి ఏళ్లలోనే దేశం వదిలిపోయినదని భావించడం సమంజసమే. దశాబ్దకాలపు యూపీఏ హయాంలోనైతే ఆ విష యంలో తొక్కిసలాట జరిగిందని అనుకోవచ్చు. వెళ్లడానికే తప్ప తిరిగిరావడా నికి వీల్లేని వన్ వే స్ట్రీట్ లాగానే ఇంతవరకు ఈ వ్యవహారం సాగుతోంది. ఆ స్వేచ్ఛాయుత రవాణా ముసిగిపోయింది. టెలివిజన్ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలను ఇరకాటాల్లోకి తోసేసే పగుళ్ల మయం. రోజుకు సరిపడే సౌండ్ బైట్లకు అవసరమయ్యేటన్ని డెసిబుల్స్ శబ్దాలతో అది పర్యవసానాల ఫలితాల గురించిన ఆలోచనే రాకుండా వారిని ముంచెత్తుతుంది. కాబట్టే ప్రత్యర్థిపై చేసిన దాడి అతి సునాయాసంగా వారిపైకే బెడిసికొట్టేదిగా మారుతుంటుంది. ప్రత్యేకించి అ దాడికి ఎంచుకున్న లక్ష్యం భ్రమాత్మకమైనది అయినప్పుడు బె డిసి కొట్టే దెబ్బ నుండి తప్పుకోవడం సైతం సులభం కాదు. విచక్షణను ఉపయోగించాలనుకోవడం, సహనం వహించడం మొట్టమొదట చేయాల్సిన మరింత తెలివైన పని అవుతుంది. ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు