
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రిగా తిరిగి అరుణ్‌జైట్లీ బాధ్యతలు స్వీకరించారు. వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం దాదాపు నెలన్నర క్రితం ఆయన అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రైల్వేలు, బొగ్గు వ్యవహారాల శాఖ మంత్రి పియూష్‌గోయెల్ ఆర్థికశాఖ అదనపు బాధ్యతలు నిర్వహించారు.
అరుణ్‌జైట్లీ గడచిన ఏడాది కాలంలో రెండుసార్లు అమెరికాకు వైద్య చికిత్సలకోసం వెళ్లారు. ఈ సమయంలో గోయెల్ ఆయన బాధ్యతలను నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్‌ను కూడా గోయెల్ పార్లమెంటు ముందు ఉంచడం గమనార్హం. గత వారమే జైట్లీ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. బాధ్యతలు స్వీకరణ సందర్భంగా జైట్లీ ప్రత్యేకంగా పదవీ ప్రమాణ స్వీకరణ చేయాల్సిన పనిలేదు.
Comments
Please login to add a commentAdd a comment