సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ నియామకాన్ని బీజేపీ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవితో గాంధీ వారసులు మ్యూజికల్ ఛైర్స్ ఆట ఆడుతున్నారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ పనికిరాడని సోనియా నియామకంతో స్పష్టమైందని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్రా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు సోనియా, రాహుల్ కుటుంబమే దిక్కయిందని అన్నారు. బీజేపీకి పార్టీయే కుటుంబమైతే, కాంగ్రెస్ మాత్రం ఓ కుటుంబానికి చెందిన పార్టీగా ఆయన అభివర్ణించారు.
కాగా, జమ్మూ కశ్మీర్ పరిణామాలపై రాహుల్ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో రెండున్నర నెలల తర్వాత పార్టీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీని సీడబ్ల్యూసీ సమావేశం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment