
భోపాల్ : బీజేపీ తరపున భోపాల్ లోక్‌సభ నియోజకవర్గంలో బరిలో నిలిచిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ గురువారం మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు.2008 మాలెగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి తాను జైలులో ఉండగా పోలీసు వేధింపుల గురించి చెబుతూ ఆమె కళ్లనీళ్లపర్యంతమయ్యారు. తాను గడిపిన జైలు జీవితం అత్యంత దుర్భరంగా గడిచిందని చెప్పారు.
పోలీసులు తనను 13 రోజుల పాటు అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని అన్నారు. మొదటి రోజు నుంచే తనను ఏమీ అడగకుండానే బెల్ట్‌లతో తీవ్రంగా కొట్టారని, తన శరీరమంతా వాతలు తేలిందని చెప్పుకొచ్చారు. ఏ మహిళకూ ఇలాంటి వేధింపులు ఎదురుకాకూడదని అన్నారు. తనను పోలీసులు హింసిస్తూ దుర్భాషలాడేవారని గుర్తుచేసుకున్నారు.మాలెగావ్ పేలుళ్లలో తనకు సంబంధం ఉందని అంగీకరించాలని పోలీసులు ఒత్తిడి చేసేవారని చెప్పారు. తనను బలవంతంగా ఒప్పించేందుకు వారు ఎంతటి హింసకైనా వెనుకాడలేదని, తనను కొట్టేవారు డ్యూటీలు మారినా వారి చేతిలో మాత్రం శిక్ష ఒకేలా ఉండేదని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment