
సాక్షి, కృష్ణా : ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు దొడ్డిదారిని ఎంచుకుంటుంది టీడీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాధారణను ఓర్వలేక కేబుల్ ప్రసారాలను నిలిపివేస్తుంది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా కృష్ణా జిల్లా తిరువురులో కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. నెట్‌వర్క్ సమస్య ఉందని చెబుతూ సుమారు గంటకు పైగా చానళ్లను ఆపేశారు. కేవలం జగన్ పర్యటన నేపథ్యంలోనే ఈ విధంగా ప్రసారాలు నిలిపివేశారని పలువులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment