
సాక్షి, హైదరాబాద్ : ప్రజల కష్టాలు ఏమిటో సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు తెలియదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆయన పార్టీ ద్వంద్వ వైఖరని అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పవన్ కల్యాణ్ పాల్గొనలేదని, ఆయనకు ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో తెలియదని మండిపడ్డారు. పవన్ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
మరోపక్క, తెలంగాణ ప్రభుత్వంపై కూడా చాడ తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. నిరంతర విద్యుత్ అందిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. చత్తీసగఢ్ నుంచి ఒక్కో యూనిట్ రూ.5 చొప్పున కొనుగోలు చేసి తీసుకొస్తున్నామంటూ రాష్ట్ర ప్రజలపై కేసీఆర్ నెలకు రూ.రెండు వేల కోట్ల అదనపు భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment