
ఛత్తీడ్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తిస్తోన్నకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి బీజేపీ పూర్తి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఛత్తీడ్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కర్ణాటక ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. తమ పార్టీకి పట్టి కట్టిన కన్నడిగులు చారిత్రాత్మక విజయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరపడిందని, వారు ప్రస్తుతం ఎక్కడికి వెళ్తారో తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు.
కాగా ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం 112 స్థానాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment