సాక్షి, జగిత్యాల: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. భారతదేశానికి తలమానికంగా భావించే జమ్మూకశ్మీర్ ప్రత్యేక హక్కులను కాపాడేందుకు ఆనాడు ఆర్టికల్ 370, 35ఏని రాజ్యాంగంలో పొందుపర్చారన్నారు. జమ్మూకశ్మీర్‌ను భారత్ భూభాగంలో అంతర్భాగంగా కొనసాగించడానికి నాడు ఈ ప్రత్యేక హక్కులను కల్పించడం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో ఉన్న సంఖ్యా బలాన్నిఆసరాగా చేసుకుని ఇలాంటి ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడం విచారకరమన్నారు.
ప్రతిపక్షాల ఆందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండా.. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడం పట్ల జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయం వల్ల భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఊహించలేమన్నారు. తాజా నిర్ణయం వల్ల ప్రపంచ దేశాలు, మన దేశంపై ప్రజాస్వామ్య విలువలను కాల రాస్తుందనే అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment