సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రేపు రీపోలింగ్ జరగనున్న కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థను పోలీసుశాఖ ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరిగినప్పుడు ఈ కేంద్రాల్లో ఒక్కోచోట ఒక్కో కానిస్టేబుల్ మాత్రమే బందోబస్తులో ఉన్నారు. ప్రస్తుతం రీ పోలింగ్ నేపథ్యంలో అవసరాన్ని బట్టి.. ఒక్కోచోట 250 నుంచి 300 మంది వరకూ సిబ్బందిని మోహరించనున్నారు. మొత్తం 1200 మంది విధుల్లో పాల్గొననున్నారు. అదనపు ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకూ విధులు నిర్వహించనున్నారు. మొదటి అంచెలో పోలింగ్ కేంద్రం భద్రత ఉంటుంది. రెండో అంచెలో పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు ఉండే భద్రతను ఇన్నర్ కార్డన్‌గా వ్యవహరిస్తారు. మూడో అంచెలో తనిఖీ పాయింట్లు, పికెట్లు ఉంటాయి. వాహనాల నిలుపుదల ప్రాంతంలో భద్రత ఉంటుంది. దీన్ని అవుటర్ కార్డన్‌గా వ్యవహరిస్తారు.
బందోబస్తుకు కేటాయించిన పోలీసులు
అదనపు ఎస్పీలు : 6 మంది
డీఎస్పీలు : 13 మంది
సీఐలు : 29 మంది
ఎస్సైలు : 78 మంది
ఏఎస్సైలు : 85 మంది
కానిస్టేబుళ్లు : 402 మంది
హోంగార్డులు : 28 మంది
మహిళా పోలీసులు: 25 మంది
ఆర్‌ఎస్సైలు : 4 మంది
ఏఆర్ హెచ్‌సీలు : 34 మంది
►వీరితో పాటు 8 ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
►14 చెక్‌పోస్టులు, 26 పికెట్లు, 7 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, 3 ఏరియా డామినేషన్ పార్టీలు, 22 షాడో పార్టీలు, 16 నిఘా కెమెరాలు, 88 బాడీవార్న్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
రీ పోలింగ్ జరిగే కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య
కేశనుపల్లి (నరసరావుపేట): 956
నల్లచెరువు (గుంటూరు పశ్చిమ): 1376
కలనూతల (యర్రగొండపాలెం): 1070
ఇసుకపాలెం (కోవూరు): 1,084
అటకానితిప్ప (సూళ్లూరుపేట): 578
Comments
Please login to add a commentAdd a comment