
న్యూఢిల్లీ: బెంగాల్ వర్సెస్ సీబీఐ వివాదంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించడాన్ని బీజేపీ ఎద్దేవా చేసింది. ట్విటర్ వేదికగా రాహుల్‌పై ఎదురుదాడి చేసింది. గతంలో శారదా చిట్‌ఫండ్ కుంభకోణంపై గతంలో రాహుల్ సంధించిన ట్వీట్లను వెలుగులోకి తీసుకొచ్చింది. బెంగాల్‌ను దోచుకుంటున్న వారిని మమతా బెనర్జీ కాపాడుతున్నారంటూ చేసిన ఆరోపణలను గుర్తు చేసింది. ఈ ట్వీట్లకు సంబంధించిన ఫొటోలను బీజేపీ అధికారిక పోస్ట్ చేసింది.
గతంలో చెప్పిన విషయాలు మర్చిపోయిన రాహుల్ గాంధీ మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధ పడుతున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ఈ రుగ్మతతో బాధపడే వారు గతంలో జరిగిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుకోవడంలో ఇబ్బంది పడతారు. వీటిని మర్చిపోతారు. రాహుల్ జీ.. త్వరగా కోలుకోండి’ అంటూ బీజేపీ ట్వీట్ చేసింది. (కోల్‌కతాలో ‘దీదీ’గిరి!)
Comments
Please login to add a commentAdd a comment