
సాక్షి, నెల్లూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కారణంగానే ముత్తుకూరు ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టు.. పరిశ్రమలు వచ్చాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు పరిపాలిస్తున్న గత ఐదేళ్లలో ఒక పరిశ్రమ కూడా రాలేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని విమర్శించారు. ఎన్నికలు రావడంతో పసుపు.. కుంకుమ పేరుతో మహిళలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వల్లే డ్వాక్రా మహిళలకు పూర్తి రుణ మాఫీ జరుగుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment