మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోజా
నగరి : ‘మహిళలకు అండగా నిలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే.. మీకు ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపు తట్టవచ్చు నావంతు సాయమందిస్తా’ అని మహిళలకు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా భరోసా ఇచ్చారు. మంగళవారం ఆమె ప్రచారంలో భాగంగా నగరి పరిధిలోని కాకవేడు రోడ్డులో ఉన్న దుస్తుల తయారీ కేంద్రంలోకి వెళ్లారు. అక్కడే పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలను ఫ్యాన్ గుర్తుకు ఓటువేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్లు మహిళలను మోసం చేసిన చంద్రబాబును ఇంటికి పంపాలన్నారు. పసుపు కుంకుమ పేరిట ఇచ్చే తాయిలాలకు ఎవరూ మోసపోవద్దని సూచించారు. మన భవిష్యత్ బాగుండాలంటే.. మహిళా సాధికారత సాధ్యం కావాలంటే జగనన్నను సీఎం చేసుకుందామన్నారు.
వైఎస్సార్‌సీపీకి అధికారం అప్పగిస్తే నాలుగు దఫాలుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తారని తెలిపారు. అలాగే వడ్డీలేని రుణాలు అందించి ఆదుకుంటామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు నాలుగు దఫాలుగా రూ.75 వేలు సాయం అందిస్తామన్నారు. పిల్లల్ని చదివించే తల్లులకు సంవత్సరానికి రూ.15వేలు మీ ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. అలాగే మీ పిల్లల్ని డాక్టర్, ఇంజినీరింగ్ కోర్సులు చదువుకోవడానికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేసి ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రతి కుటుంబానికి లక్ష నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరేవిధంగా నవరత్నాలు పథకాలు రూపొందింంచామన్నారు. నీటి సమస్యతో ప్రస్తుతం మహిళలు ఇబ్బంది పడుతున్నారని గాలేరు–నగరి ప్రాజెక్టు పూర్తికాకపోవడమే దీనికి కారణమన్నారు. ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో నగరి, పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు లేదన్నారు. ఎక్కడ బోరువేసినా నీరు లేని పరిస్థితి ఉందని, దీనికితోడు వరుస కరువు తాండవిస్తోందని తెలిపారు. చంద్రబాబు పాలనలో వర్షాలు పడవని, కరువు మాత్రమే ఉం టుందని, వర్షాలు పడాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. నాయకులు వెంకటరత్నం, కృష్ణమూర్తి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment