
రాంచీ : మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కలయిక అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. శివసేన కూటమి అధికార పగ్గాలు చేపట్టినా ఆ ప్రభుత్వం ఎనిమిది నెలలకు మించి కొనసాగలేదని జోస్యం చెప్పారు. సిద్ధాంత వైరుధ్యాలున్న మూడు పార్టీలు చేతులు కలపడానికి అవకాశవాదమే మూలమని, బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించేందుకే ఈ పార్టీలు కలిశాయని విమర్శించారు. అసలు ఈ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని..ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆరు నుంచి ఎనిమిది నెలలకు మించి వీరు ప్రభుత్వాన్ని నడపలేరని దుయ్యబట్టారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడ్కరీ రాంచీలో జరిగిన సభలో మాట్లడారు.
Comments
Please login to add a commentAdd a comment