ముంబై : ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు.. భద్రతా దళాలను వాడకోకూడదంటూ ఈసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ నాయకులు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బీజేపీ నాయకురాలు పంకజ ముండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద పేలుడు పదార్థాలు ప్రయోగిస్తే.. సర్జికల్ స్ట్రైక్స్ గురించి అనుమానం వ్యక్తం చేసేవారు నోరు ముస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్నా లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించారు పంకజ ముండే.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన సైనికుల మీద దాడి చేసిన ఉగ్రవాదులపై సర్జికల్ దాడులు జరిపాము. కానీ కొందరు ‘అసలు దాడులు ఎక్కడ జరిపారు.. ఆధారాలేవ’ని ప్రశ్నిస్తున్నారు. వారికి అర్థమవ్వాలంటే ఒకటే దారి.. రాహుల్ గాంధీ మెడలో బాంబు కట్టి.. వేరే దేశానికి పంపించాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంకజ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment