‘వాక్‌ విత్‌ జగన్‌’కు అపూర్వస్పందన | people support to ys jagan in walk with jagan | Sakshi
Sakshi News home page

ప్రభంజనం

Published Tue, Jan 30 2018 10:56 AM | Last Updated on Wed, Jul 25 2018 5:17 PM

people support to ys jagan in walk with jagan - Sakshi

జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు జనసంద్రమయ్యాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే సంక్షేమ పాలన సాధ్యమంటూ ప్రజానీకం నినదించింది. పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘వాక్‌ విత్‌ జగన్‌’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నాలుగేళ్ల టీడీపీ పాలనలో విసిగివేసారిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడతూర్పులో భారీగా కదలివచ్చిన కార్యకర్తల చిత్రమిది.

వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమం కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో సోమవారం విజయవంతంగా నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరిన సందర్భంగా  సంఘీభావంగా  వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్ర చేశారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు, యువకులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ ప్రియతమ నేతకు మద్దతుగా భారీగా ర్యాలీలు  నిర్వహించారు.  జగనన్నా ..! నీకు తోడుగా మీమున్నామంటూ నినదించారు. జననేత వేసే ప్రతి అడుగు వెంట తామూ పయనిస్తామని స్పష్టం చేశారు.

విజయవాడ సిటీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో సోమవారం నిర్వహిం చిన ‘వాక్‌ విత్‌ జగనన్న’ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటి సంక్షేమ పాలన మళ్లీ చూడాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలంటూ ప్రస్తుత ప్రభుత్వం విధానాలలో విసిగివేసారిన వృద్ధులు, మహిళలు, యువతీయువకులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు తరలి రావడంతో నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు జనసంద్రాన్ని తలపించాయి.

పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాల్లో వైఎస్సార్‌ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి వాక్‌ విత్‌ జగనన్న నిర్వహించారు. కంకిపాడు సెంటరు నుంచి పునాదిపాడు, గొల్లగూడెం, మీదుగా కోలవెన్ను వరకూ పాదయాత్ర నిర్వహించారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ నగర అ«ధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్‌ నేతృత్వంలో జరిగిన వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి హాజరయ్యారు. ప్రత్యేకంగా అలంకరించిన అశ్వాలపై కార్యకర్తలు, నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పతాకాలను చేతపట్టి పాదయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలి చారు. రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు విధానమని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. పలు చోట్ల నేతలు ఏర్పాటు చేసిన కేక్‌లను కట్‌చేసి పంచిపెట్టారు.
గుడివాడ పట్టణంలో శరత్‌ థియేటర్‌ నుంచి నాగవరప్పాడు వరకు సాగిన వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పాల్గొన్నారు.
విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో పార్టీ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో బీఆర్టీఎస్‌ రోడ్డు సీతన్నపేట గేటు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొంతవంతెన సెంటర్‌ నేతాజీ సుభాష్‌ చంద్రబోసు విగ్రహం వరకు సాగింది.
విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వకర్త బొప్పన భవకుమార్‌ ఆధ్వర్యంలో క్రీస్తురాజుపురం చర్చి నుంచి గుణదల మాత ఆలయం వరకూ పాదయాత్ర సాగింది. అనంతరం ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని కోరుతూ మేరీయాత ఆలయంలో పూజలు నిర్వహించారు. పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మహబూబ్‌ షేక్, నాయకులు ఎంవీఆర్‌ చౌదరి, తంగిరాల రామిరెడ్డి, డి.కాళేశ్వరారవు, దుర్గారావు, తోకల శ్యామ్‌కుమార్, మేడా రమేష్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో వాక్‌విత్‌ జగనన్న నిర్వహించారు. వత్సవాయిలో ఆర్యవైశ్య కల్యాణ మండపం నుంచి గాంధీ పార్క్‌ సెంటర్‌ వరకు పాదయాత్ర నిర్వహించి, ఆలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు చేశారు. పెనుగంచిప్రోలులో లింగగూడెం అడ్డరోడ్డు నుంచి తిరుపతమ్మ ఆలయం వరకు వాక్‌ విత్‌ జగనన్న నిర్వహించారు. పార్టీ పంచాయతీ రాజ్‌ విభాగం జిల్లా కన్వీనర్‌ తన్నీరు నాగేశ్వరరావు, యువజన నాయకుడు సామినేని వెంకట కృష్ణప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంజం చెన్నకేశవరావు పాల్గొన్నారు.
నూజివీడు పట్టణంలో ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు ఆధ్వర్యంలో 4కిలో మీటర్లమేర పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. సంక్షేమ పాలన జగన్‌కు మాత్రమే సాధ్యమన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బసవా రేవతి, పట్టణ, నూజివీడు మండల అధ్యక్షులు పగడాల సత్యన్నారాయణ, మందాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పామర్రు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ౖకైలే అనీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో పామర్రు, మొవ్వమండలాలు, పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల్లో పార్టీ మండల అ«ధ్యక్షులు ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. పార్టీ మహిళా విభాగం అ«ధ్యక్షురాలు, బాపులపాడు జెడీపీటీసీ కైలే జ్ఞానమణి పెదపారుపూడి మండలంలో వాక్‌ విత్‌
జగనన్న కార్యక్రమంలో పాల్గొన్నారు.    
కైకలూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) ఆధ్వరయంలో కైకలూరులో సంతమార్కెట్‌ వైఎస్‌ విగ్రహం నుంచి ఆటపాక వరకు పాదయాత్ర చేసి, భారీ కెక్‌ కట్‌ చేశారు. ముదినేపల్లి మండలంలో డీఎన్నార్, మండవల్లి, కలిదిండి మండలాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. రాష్ట్ర నాయకులు పోసిన పాపారావుగౌడ్, బొడ్డు నోబుల్, వాసిపల్లి యోనా, నిమ్మగడ్డ భిక్షాలు పాల్గొన్నారు.
నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో కంచికచర్ల, చందర్లపాడు మండలాల్లో పాదయాత్ర జరిగింది. నందిగామ, వీరులపాడు మండలాల్లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతి నిధి డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ పాదయాత్ర ప్రారంభించారు. నందిగామ పట్టణంలో అతి పొడవైన పార్టీ జెండాతో కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు.
అవనిగడ్డ నియోజకవర్గ కన్వీనర్‌ సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో చేపట్టిన 12 కిలో మీటర్ల వాక్‌విత్‌ జగనన్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథంపట్టారు. నాగాయలంక నుంచి అవనిగడ్డ జరిగిన పాదయాత్రను పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రారంభించారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. òజిల్లా కోర్టు సెంటరులోని వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసిన పేర్ని నాని అక్కడి నుంచి కోనేరుసెంటరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
మైలవరం నియోజక వర్గం పార్టీ సమన్వయకర్త జోగి రమేష్‌ ఆధ్వర్యంలో మైలవరం నుంచి ఇబ్రహీంపట్నం వరకు బైక్‌ ర్యాలీ జరి గింది. ఇబ్రహీంపట్నంలో జరిగిన భారీ పాదయాత్రలో జోగి రమేష్‌ పాల్గొన్నారు.
తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన జరిగింది. వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుంచి రాజుపేటలోని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement