‘‘రోమియో, పోకిరి, లవర్’’ ‘‘ఏంట్సార్.. సినిమా టైటిల్స్‌ను కలవరిస్తున్నారు?’’ ‘‘ఛ.. ఛ.. సినిమా టైటిల్స్ కావవి. మన బాబు గారిని చూస్తే అలా పిలవాలనిపిస్తోంది’’
‘‘అదేమిటి? మన బాబుగారికి అధికారం, రుబాబు, అంతా నేనే అనే డాంబికం తప్పితే.. ప్రేమలూ, అభిమానాలూ, ఆప్యాయతలూ ఇవేవీ ఆయన ఒంటికి పడవూ.. సరిపడవు కదా’’
‘‘బాబుగారికి ప్రేమలూ, అభిమానాలూ, ఆప్యాయతలూ ఇవన్నీ ఉంటాయని నేనెందుకంటున్నా. ఆయన అవేవీ లేని బ్యాడ్ రోమియో, పోకిరి, లవర్ బాయ్’’
‘‘బాబు రోమియో, లవర్ ఎలా అవుతాడు సార్?’’
‘‘తెలంగాణ ఎన్నికలకు ముందు హరికృష్ణ యాక్సిడెంట్‌లో చనిపోయాక చూశావు కదా.. సాక్షాత్తూ ఆ శవం పక్కనే కూర్చునిమరీ టీఆర్‌ఎస్ పార్టీకి ఓ గులాబి పువ్వు పంపించి ప్రపోజ్ చేశాడు.. ‘ఐ లవ్ యూ’ అని. అది కూడా తన ప్రేమరాయబారిగా సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత కొడుకు కేటీఆర్ ద్వారా తన ప్రపోజల్ పంపించాడు. ఈ యాంగిల్‌లో చూడు మన బాబుగారు లవర్‌బాయ్‌గా కనిపించడం లేదా?’’
‘‘మరి బ్యాడ్ రోమియో అని ఏదో అన్నారు. బ్యాడ్ ఎలా?’’
‘‘అక్కడికే వస్తున్నా. ఇప్పుడూ టీఆర్‌ఎస్‌ను ప్రేమించిందే అతడు. దాంతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో చెట్టాపట్టాలేసుకోవాలనుకుని ప్రచారాల మోటార్‌సైకిళ్ల మీద లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలని తలచింది అతడు. పోలింగ్‌బూత్ పార్కుల్లో రొమాన్స్ ఆడాలని నిశ్చయించుకుంది అతడు. ఇలా అన్నీ చేసింది అతడే. అంటే.. పొత్తు అనే లవ్‌తో టీఆర్‌ఎస్‌ను తెగ వాడుకోవచ్చనీ, అలా తెలంగాణ ఎన్నికలలో తన ప్రయోజనాల పబ్బం గడుపుకోవచ్చనీ మనసావాచాకర్మణ అనుకున్నది మన బాబుగారే కదా’’
‘‘అవును కదా.. కానీ ఇంతకీ బాబుగారు బ్యాడ్ రోమియో ఎలా అయ్యాడో ఇంకా తమరు సెలవియ్యలేదు..’’
‘‘అక్కడికే వస్తున్నా.. మనం ప్రపోజ్ చేసిన అమ్మాయి మనకు పడలేదనుకో. అప్పుడు బ్యాడ్ లవర్‌లు ఏం చేస్తారో తెలుసా? వాళ్లను తనకు సరిపడని వాళ్లకో.. మరింకెవరికో అంటగడతారు. అలా అంటగట్టి.. పాతరోజుల్లో అయితే అసహ్యం గోడల మీద పేర్లురాసి ఇద్దర్నీ బదనాం చేయడం అలాంటివి చేసేవారు. ఇవి మోడ్రన్ రోజులు కదా.. అందుకే ఇప్పుడు ఫేస్‌బుక్‌లాంటి మీడియా గోడల మీద.. తమ గోడ పత్రికల్లాంటి సొంత బాకాపేపర్లలో రాయిస్తూ.. జగన్‌గారికిఆ పార్టీని అంటగడుతున్నాడు.
ఇప్పుడు చెప్పు.. తన ప్రేమికురాలు తన లవ్‌ను కాదన్నదని సాక్షాత్తూ లవ్ రిజెక్ట్ అయిన వెరీబ్యాడ్ రోమియోలా ప్రవర్తించడం లేదా?’’
‘‘అవును సార్. మీరు చెబుతున్నది నాకిప్పుడు అర్థమైంది. జగన్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ కోసమే ఇదంతా చేశాడని ప్రజలకు తెలిసేదెలా?’’
‘‘సింపుల్.. ప్రజలు చాలా తెలివైనవాళ్లు. జగన్ వెనక టీఆర్‌ఎస్ ఉందీ, తెలంగాణ ఉందీ అంటూ తెగ బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నాడు కదా.. మరి ఒకప్పుడు తానే టీఆర్‌ఎస్‌కు ప్రపోజ్ చేసినవాడు.. ఆ లవ్.. అదే ఆ పొత్తు గనక సక్సెస్ అయితే రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు తాకట్టు పెట్టేవాళ్లో.. పొత్తు ధర్మానికి కట్టుబడి ఎవరు లొంగిపోయినట్టుగా ప్రవర్తించేవాళ్లో అందరూ అర్థం చేసుకోగలరనే అనుకుంటున్నా. ఆ మాత్రం కామన్‌సెన్స్ ప్రజలందరికీ ఉంటుందనే విషయం బాబుగారికి ఈ ఎన్నికలతోనైనా స్పష్టంగా తెలియాలి. ఈ రోమియో తరహా పప్పులిక ఉడకవని బాబుగారికి తెలిసిరావాలి. అదే నా కోరిక’’
Comments
Please login to add a commentAdd a comment