
విలేకరులతో మాట్లాడుతున్న కన్నయ్య కుమార్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమని, రాజకీయాల్లో జవాబుదారీతనం, నైతిక విలువలు నశిస్తున్నాయని జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ అన్నారు. మంగళవారం ఇక్కడి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో కాసేపు ముచ్చటించారు. ‘ఈ రోజు గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీల జయంతి. వీరిద్దరూ దేశంలో తమదైన ముద్ర వేశారు.
రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి శాస్త్రి. నేటి రాజకీయాల్లో అలాంటి నైతికతను మనం ఆశించలేకపోతున్నాం’ అని అన్నారు. రైతు రుణాల వసూలులో కఠినంగా ఉన్నవారు, డిఫాల్టర్లపై ఎందుకు కనికరం చూపుతున్నారని ప్రశ్నించారు. దాదాపు 4 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
వాస్తవాలను వెలికి తీయాల్సిన మీడియా ఇప్పుడు కార్పొరేట్ చేతిలో బందీగా మారిందని, పాలకులు మీడియా గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే అడ్వర్టయిజ్‌మెంట్లు నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను నీరుగారుస్తోందని, బీఎస్‌ఎన్‌ఎల్‌ను కాదని జియోకు ప్రచారం కల్పించడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
సమానత్వంతోనే అవినీతి అంతం
సమాజంలో సమానత్వం వచ్చినప్పుడే అవినీతి నశి స్తుందని కన్నయ్య చెప్పారు. అవినీతిని రూపుమాపేందుకు సమాజంలోని అన్ని వర్గాలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్ర విధానాల్ని ఎదురించడానికి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ ఒక్కటవ్వడాన్ని ఆయన సమర్థించారు.
నీల్, లాల్ కలసి పోరాడాలి
నీల్– లాల్ కలిసి పోరాడటాన్ని కన్నయ్య సమర్థిం చారు. మహారాష్ట్రలో పారిశుద్ధ్య కార్మికుల కోసం తాను– జిగ్నేశ్ మేవానీ కలసి పోరాడటాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. దేశంలోని 90 శాతం సహజ వనరులను కేవలం 2 కంపెనీలు దోచుకుం టున్నాయని ఆరోపించారు. అన్యాయాన్ని ఎదురించి న వారిపై దేశద్రోహులు, నక్సలైట్లు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ అనుకూలురు అంటూ ముద్రవేస్తున్నారని ఆరోపించారు. తనపై పెట్టిన దేశభక్తి కేసు కూడా అలాంటిదేనన్నారు.
ఆ కేసులో ఇప్పటివరకూ ఎలాం టి చార్జిషీటు దాఖలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. గుర్తుతెలియని వ్యక్తులపై దేశద్రోహం పెట్టిన తొలి కేసుగా ఇది చరిత్రలో నిలిచిపోతుంద న్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు లు దేవులపల్లి అమర్, శ్రీనివాసరెడ్డి, విరాహత్ అలీ తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన 220 మంది జర్నలిస్టులకు న్యాయం చేకూరేలా సాగుతు న్న పోరాటంలో మద్దతివాలని కన్నయ్యను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment