సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్ డిమా ండ్ చేశారు. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని, దీని చాటున ప్రభుత్వ యంత్రా ంగాన్ని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వినియోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ‘ఎన్నికల్లో అక్రమాలు అరికట్టాలి–డబ్బు సారా పంపిణీ నిరోధించాలి’అనే అంశంపై నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సదస్సులో జస్టిస్ బి.చంద్రకుమార్ పాల్గొని మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన నేతలు రాజకీయ ప్రయోజనాల కోస ం పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగితే ఏపీ ఇంటె లిజెన్స్ పోలీసులు సర్వేలు చేయడం, నివేదికలు అందించడమేమిటని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన కొంగర కలాన్ సభలో టీఆర్‌ఎస్ పార్టీ మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేసిందని కాబట్టి ఎన్నికల సంఘానికి, రాష్ట్రపతికి ఏమాత్రం ప్రజాస్వామ్యంపై నమ్మకమున్నా రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సిబ్బంది, బ్యాలెట్ పేపర్, ఇతర సామగ్రి గులాబి రంగులో ఉండకూడదని, ఎన్నికలను ప్రభావితం చేసే పద్ధతులను అధికార పార్టీలు అవలంబించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీని కోరారు.
అన్ని చోట్లా పోటీ చేస్తాం
వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు చంద్రకుమార్ తెలిపారు. కలిసి వచ్చే చిన్న పార్టీలతో కలిసి త్వరలోనే ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన యువతరం కదలిరావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో మద్యాన్ని, డబ్బును, పంపిణీ చేసే ఫొటోలను తీసి తమకు అందజేస్తే న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.25 కోట్లు నుంచి రూ.50 కోట్లమేర ఖర్చు చేసి ఎన్నికల్లో గెలుస్తున్నారని, ఎన్నికల్లో సామాన్యుడు పోటీచేసే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు నిజాయితీపరులకు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో నేతలు మురళీధర్ గుప్తా, ఇంద్రసేన, నాగరాజు, ప్రొఫెసర్ ఈశ్వరయ్య, రామకృష్ణ, వాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment