సాక్షి, హైదరాబాద్: గ్రామ సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని మార్పు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తప్పుపట్టారు. పరోక్ష పద్ధతిలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సర్పంచ్‌ను ఎన్నుకునే విధానాన్ని తిరిగి ప్రవేశపెడితే గ్రూపు, క్యాంపు రాజకీయాలకు బలవంతులు, ధనవంతులకు పరోక్షంగా పగ్గాలు ఇచ్చినట్లు అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పరోక్ష ఎన్నికల్లో ఎన్నికైన సర్పంచ్ కేవలం తనకు అనుకూలంగా ఉన్న వార్డు సభ్యులు చెప్పినట్లు చేయడానికే ప్రాధాన్యం ఇస్తారని.. దీనివల్ల వార్డు సభ్యుల మధ్య వైరం పెరగడమే కాకుండా గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment