సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాహుల్‌గాంధీ తెలంగాణకు రానున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటిం చనున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య బస్సుయాత్రలో పాల్గొనడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
గురువారం గాంధీభవన్‌లో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. 13న బస్సుయాత్రలో రాహుల్ పాల్గొంటారని, మరుసటి రోజు పలు వర్గాలతో సమావేశమవుతారని చెప్పారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులతో రాహుల్ సమావేశమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఉత్తమ్ నేతృత్వంలో గాంధీభవన్‌లో పీసీసీ ముఖ్యుల సమావేశం జరిగింది.
సోషల్ మీడియా ద్వారా ప్రచారం
ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నా భవిష్యత్తులో అది మరింత పెరగాలని ఆయన కోరారు.
గురువారం గాంధీ భవన్‌లో టీపీసీసీ ఐటీ సెల్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఐటీ విభాగం కీలక పాత్ర పోషించాలని సూచించారు. టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్‌గా ప్రముఖ ఐటీ రంగ నిపుణుడు కలకుంట్ల మదన్‌మోహన్‌ను నియమించారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment