మోదీపై విశ్వాసం వల్లే... | Ravi Shankar Prasad Thanked Kannada People | Sakshi
Sakshi News home page

మోదీపై విశ్వాసం వల్లే...

Published Tue, May 15 2018 12:31 PM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

Ravi Shankar Prasad Thanked Kannada People - Sakshi

బీజేపీ శ్రేణుల సంబరాలు

సాక్షి, బెంగళూరు : ఈరోజు(మంగళవారం) వెలువడనున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతూ విజయానికి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటక ఫలితాలు మోదీ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరోసారి నిరూపించాయని పేర్కొన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ కార్యకర్తల కఠోర శ్రమ ఫలించిందని రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. వారు మా(బీజేపీ)పై ఉంచిన నమ్మకానికి నమ్మకానికి బదులుగా నిజాయితీతో కూడిన పాలన అందిస్తామంటూ హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement