
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబానికి సాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. మిలియన్ మార్చ్‌కు వెళ్లలేకపోయాననే బాధతో నిజామాబాద్ జిల్లా నాగారంలోని భరత్‌నగర్‌కు చెందిన సాయాగౌడ్.. 2011 మార్చి 10న ఒంటిపై కిరోసిన్ పోసుకుని జై తెలంగాణ అని నినాదాలు చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని లేఖలో పేర్కొన్నారు. దీనిపై నిజామాబాద్ 5వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నంబరు 33తో కేసు నమోదైనట్లు వివరించారు.
ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఆర్థిక సాయం అందించాలంటూ సాయాగౌడ్ చెల్లెలు ప్రసన్న ఇప్పటికే అనేకసార్లు వినతిపత్రం అందించిందని, కలెక్టర్ కూడా ఎన్నోసార్లు ప్రభుత్వానికి నివేదిక పంపారని అయినా ఎలాంటి సాయం అందలేదని రేవంత్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment