సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభను కేంద్రం నడుపుతున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని, ప్రతి రోజూ ఉదయం 11 నుంచి 12.. 12 నుంచి రేపు అన్న రీతిలో సభను నడుపుతోం దని టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచి రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రం ప్రకటన చేసే వరకు తమ నిరసన విరమించబోమన్నారు.
బుధవారం లోక్‌సభ వాయిదా పడిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై చర్చకు తమ మద్దతు ఉంటుందని, వైఎస్సార్‌సీపీ, టీడీపీల పోరాటం కోసం తమను బలిచేయొద్దన్నారు.
స్పీకర్‌ను కలసిన టీఆర్‌ఎస్ ఎంపీలు..
లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో టీఆర్‌ఎస్ ఎంపీలు బుధవారం భేటీ అయ్యారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్ లోక్‌సభలోని ఆమె చాంబర్‌లో కలిశారు. రిజర్వేషన్ల పెంపుపై తాము సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచి ఆందోళన చేస్తున్నామని, దీనిపై సభలో కేంద్రంతో ఒక నిర్ధిష్ట ప్రకటన చేయించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment