జనాభా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు పెంచాలి | sc reservations increase according to population | Sakshi
Sakshi News home page

జనాభా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు పెంచాలి

Published Fri, Nov 28 2014 1:40 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

జనాభా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు పెంచాలి - Sakshi

జనాభా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు పెంచాలి

* లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్

సాక్షి, న్యూఢిల్లీ: జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లను పెంచాలని టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ కేంద్రాన్ని కోరారు. ఎస్సీ జాబితాలో మరికొన్ని కులాలను చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ చట్టానికి సవరణలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. గురువారం లోక్‌సభలో ఎస్సీ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.

కొత్తగా కులాలను ఎస్సీ జాబితాలో చేర్చితే సరిపోదని, ఆ మేరకు రిజర్వేషన్లు పెంచుతున్నారా.. లేదా.. అన్న అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. కొత్త కులాలను చేర్చినప్పుడు రిజర్వేషన్లను సర్దుబాటు చేయకుండా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement