
న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌పర్సన్ సోనియా మంగళవారం ప్రతిపక్ష నేతలకు విందు ఇవ్వనున్నారు. ప్రతిపక్షంలోని 17 పార్టీల నేతలు ఈ విందుకు హాజరవుతారని భావిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు దీటుగా విస్తృత కూటమిని ఏర్పాటు చేసే అంశంపై ఈ సందర్భంగా సోనియా వారితో చర్చించనున్నారు. విందు భేటీకి జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎంకు చెందిన బాబూలాల్ మరాండీ, బిహార్ మాజీ సీఎం జితన్ మాంఝి, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్, టీఎంసీకి చెందిన సుదీప్ బందోపాధ్యాయ్, డీఎంకే తరఫున కనిమొళి హాజరయ్యే వీలుంది. సీపీఎం నేత ఏచూరి, సీపీఐకి చెందిన డి.రాజాతోపాటు ఆర్‌ఎల్డీ పార్టీ నేతలు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment