సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శుక్రవారం ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన రెండు మెమోలను విచారించిన కోర్టు.. శ్రీనివాస్‌కు ఫిబ్రవరి 8 వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు తరలించాలని అధికారులను ఆదేశించింది. సెంట్రల్ జైల్లో శ్రీనివాస్‌కు ప్రత్యేక బ్యారక్‌తో పాటు పెన్ను, పుస్తకం, న్యూస్ పేపర్ అందించాలని అతని తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు ఎన్‌ఐఏ కోర్టు అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment