హైదరాబాద్: తెలంగాణ ప్రజల పార్టీ మేనిఫె స్టోను, ఎన్నికల గుర్తు టార్చ్‌లైట్ లోగోను ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రిటైర్డ్ జస్టిస్ బి.చంద్రకుమార్ ఆదివారం ఇక్కడ ఆవిష్కరించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాంబశివగౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ‘అందరికీ అభివృద్ధి– అందరికీ ఆత్మగౌరవం’ అనేది తమ నినాదమని, తమ పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ, ప్రైవేటుపరంగా ఉద్యోగ అవకాశాలు కలిగేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబా ల్లోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని లేదా ఐదు ఎకరాల భూమిని ఇస్తామని పేర్కొన్నారు. బీసీని సీఎంగా, మహిళను ఉప ముఖ్య మంత్రి చేస్తామని తెలిపారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ కన్వీనర్ మురళీధర్‌గుప్తాను పార్టీ ఉపాధ్యక్షుడి గా నియమించారు. ఈ సందర్భంగా పలు సామాజికవర్గాల నేతలు ఆ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు నల్లగొండ అంజి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment