Chandra Kumar
-
ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) ఏర్పాటైంది. ఇందులో సీపీఐ, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ (యూ), ఆర్ఎస్పీ, బీఎల్ఎఫ్, భారత జాతీయ ఉద్యమ సంఘం తదితర అనేక లౌకిక ప్రజాసంఘాలు కలిసి టీఎస్డీ ఎఫ్‌ను ఏర్పాటు చేశాయి. ఈ వేదికకు చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, కో కన్వీనర్లుగా పార్టీకొకరు చొప్పున ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర సమన్వయకర్తగా నైనాల గోవర్ధన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఎస్డీఎఫ్ విధాన పత్రం, ఉమ్మడి కార్యాచరణను నాయకులు ప్రకటించారు. చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరే కంగా వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాస్వామిక సంస్థలు కలిసి ఈ వేదికను ఏర్పాటు చేశాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అదానీ, అంబానీ లాంటి కొద్దిమంది పెట్టు బడిదారులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేతిలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్నారు. బీజేపీ మతోన్మాద విధా నాలు, బడా సంపన్న అనుకూల విధానాలు, పేదల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తామ న్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం అడ్డూ అదుపులేని అవినీతికి పాల్పడుతోందని దుయ్య బట్టారు. తెలంగాణలో అవినీతి ప్రపంచ రికార్డు లను కూడా బద్దలు కొట్టిందన్నారు. ఈ అవినీతి తెలంగాణ ప్రజల పురోభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిందని, అందుకే అంతా కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జువ్వాడి చలపతిరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాల మల్లేశ్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకుడు హన్మేష్, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తుకారాం, ఇతర నాయకులు గుర్రం విజయ్ కుమార్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్డీఎఫ్ విధాన పత్రం ముఖ్యాంశాలు ఇవీ.. ప్రతి మండలంలో అవసరమైనన్ని నాణ్యమైన పాఠశాలలు స్థాపించాలి. నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఐదు వేల మంది జనాభాకు ఒక రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పాలి. స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగ హక్కును కల్పించాలి. లేకుంటే నిరుద్యోగులందరికీ జీవించే నిరుద్యోగ భృతిని ఇవ్వాలి. భూమిలేని పేదలకు భూములను పంపిణీ చేయాలి. దళితులకు 3ఎకరాల భూమి ఇవ్వాలి. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. కుల ప్రాతిపదికగా జన గణన జరగాలి. చట్టసభల్లో బీసీలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. -
బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారు: ఇంటి పార్టీ
హైదరాబాద్: మహా కూటమి తరపున తెలంగాణ ఇంటి పార్టీకి సీట్లు కేటాయించకపోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందని, ఇంటి పార్టీని మొదటి నుంచి దూరం చేయాలని చూశారని ఆరోపించారు. కూటమిలో ఉద్యమకారులకు ద్రోహం జరిగిందన్నారు. తాము మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో రెండు సీట్లు అడిగామని వెల్లడించారు. ఢిల్లీలో బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారని ఆరోపించారు. కూటమి సీట్లలో సామాజిక న్యాయమే లేదని వ్యాక్యానించారు. సీట్ల జాప్యానికి కోదండరాం, ఉత్తమ్ కుమార్ రెడ్డిలే కారణమన్నారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో తాను పోటీ చేయదలచుకున్నానని తెలిపారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ కూడా మోసం చేసిందని విమర్శించారు. ఆర్ధిక సమానత్వం కోసం పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఇంటి పార్టీ నేత జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సామాజిక, ఆర్ధిక న్యాయం దొరకడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిందెవరని ప్రశ్నించారు. త్యాగాలు ఒకరివి భోగాలు మరొకరికి చేరుతున్నాయన్నారు. ఎదుగుతున్న బీసీ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, చెరకు సుధాకర్లకు సీట్లు ఇవ్వలేదని విమర్శించారు. సీపీఐ, కాంగ్రెస్, టీజేఎస్ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుల చేతిలో ఉన్నాయని, సామాజిక న్యాయం చేయని వారికి తమ మద్ధుతు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. తెలంగాణ ఇంటి పార్టీ ఉద్యమ కారులకు అండగా ఉంటుందని, మంచి కూటమితో ముందుకు వస్తామని తెలిపారు. డబ్బులు, మద్యానికి లొంగకుండా ప్రజలు ఓటు వేయాలని కోరారు. అంతకుముందు తెలంగాణ ఇంటి పార్టీ ఆద్వర్యంలో అమరుల స్థూపానికి చెరకు సుధాకర్, చంద్రకుమార్‌లు నివాళులు అర్పించారు. -
తెలంగాణ ప్రజల పార్టీ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్: తెలంగాణ ప్రజల పార్టీ మేనిఫె స్టోను, ఎన్నికల గుర్తు టార్చ్‌లైట్ లోగోను ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రిటైర్డ్ జస్టిస్ బి.చంద్రకుమార్ ఆదివారం ఇక్కడ ఆవిష్కరించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాంబశివగౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ‘అందరికీ అభివృద్ధి– అందరికీ ఆత్మగౌరవం’ అనేది తమ నినాదమని, తమ పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ, ప్రైవేటుపరంగా ఉద్యోగ అవకాశాలు కలిగేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబా ల్లోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని లేదా ఐదు ఎకరాల భూమిని ఇస్తామని పేర్కొన్నారు. బీసీని సీఎంగా, మహిళను ఉప ముఖ్య మంత్రి చేస్తామని తెలిపారు. సంపూర్ణ మద్యపాన నిషేధానికి కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ కన్వీనర్ మురళీధర్గుప్తాను పార్టీ ఉపాధ్యక్షుడి గా నియమించారు. ఈ సందర్భంగా పలు సామాజికవర్గాల నేతలు ఆ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు నల్లగొండ అంజి తదితరులు పాల్గొన్నారు. -
‘టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం’
హైదరాబాద్: టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణలో సాధించిన అభివృద్ధి శూన్యమని తెలంగాణ ప్రజల పార్టీ (టీపీపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. ప్రగతి నివేదన సభ ఎందుకు ఏర్పాటు చేశారో, ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారో ఎవరికీ అర్థం కాని రీతిన సభను నిర్వహించారని ఎద్దేవా చేశారు. ప్రగతి నివేదన సభలో మద్యం ఏరులై పారిందన్నారు. సభలో సీఎం కేసీఆర్ ఏవో హామీలు ఇస్తారని ఆశించిన నిరుద్యోగ యువతకు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించే హామీలు ఇవ్వకపోవడం విచారకరమని తెలిపారు. మంగళవారం నల్లకుంటలోని పార్టీ కార్యాలయంలో చంద్రకుమార్ మాట్లాడారు. పంటకు గిట్టుబాటు ధరలు రాక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు అందించి రైతు ఆత్మహత్యలను నివారించలేని దయనీయ స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సహాయం చేయడంతో రైతుల సమస్యలు తీరవని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో మహిళల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
పోలీసులపైకి బ్రహ్మాస్త్రం
పంజగుట్ట: న్యాయపరమైన, చట్టానికి, రాజ్యాంగానికి సంబంధించిన సమాచారం తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయని అలాంటి సమాచారంతో కూడుకున్న పుస్తకం రావడం ఎంతో సంతోషకరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో న్యాయవాది, రచయత నర్సింగరావు రచించిన ‘ప్రభుత్వ అధికారుల, పోలీసుల పైకి బ్రహ్మాస్త్రం’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ రాజకీయ జెఏసీ చైర్మర్ ప్రొఫెసర్ కోదండరామ్‌లు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ .. సరళమైన భాషలో సామాన్య ప్రజలకు అర్దమయ్యే విధంగా ఎంతో క్లిష్టమైన విషయాలు పుస్తకంలో అందించారని కొనియాడారు. చట్టం, మానవహక్కులు, ప్రాథమిక హక్కులు, కలెక్టర్ విధులు, పోలీస్ ఉన్నతాధికారుల విధులు, పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తే ఏమి చేయాలి, బెయిల్ పొందడం ఎలా, పోలీసులు, ప్రభుత్వ అధికారులు నేరం చేసినా, అవినీతికి పాల్పడినా ఎవరికి ఫిర్యాదు చేయాలి లాంటి విషయాలు కూడా స్పష్టంగా పుస్తకంలో పొందుపర్చారని తెలిపారు. ప్రభుత్వం వారు ఈ పుస్తకాన్ని అన్ని జిల్లాల్లో అన్ని లైబ్రరీల్లో ఉంచాలని, హైకోర్టు వారు కూడా ఈ పుస్తకాన్ని ప్రతి కోర్టుకు పంపితే ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ... చట్టంపై, రాజ్యాంగంపై ప్రజలకు ఎంత తెలిస్తే వారి హక్కుల సాధనకోసం అంతగా ఐక్యమౌతారని అన్నారు. గతంలో బొజ్జాతారకం పోలీసులు అరెస్టు చేస్తే అనే పుస్తకం తెస్తే ప్రజలు ఇష్టంగా కొనుక్కుని చదివి తమ హక్కుల పరిరక్షణ కోసం ప్రయత్నం చేశారని, ఈ పుస్తకం కూడా అలాంటిదేనని అన్నారు. చట్టం కల్పిస్తున్న అనేక హక్కులు ట్రేడ్‌యూనియన్, కనీసవేతన చట్టాలు, మానవహక్కుల చట్టాలు పొందుపర్చి ఉందని ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందిన్నారు. పుస్తక రచయత నర్సింగ్‌రావు మాట్లాడుతూ ..పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా ఈ పుస్తకం వ్యతిరేకం కాదని, చట్ట విరుద్దమైన పనులు చేసిన వారికి బ్రహ్మస్త్రంలా ఉంటుందని పేర్కొన్నారు. -
చేయలేమని తెలిసీ హామీ ఇస్తే మోసం కాదా?
నేతలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ చురక అనంతపురం లీగల్: పర్యవసానాలేమీ తెలియకుండా నాయకులు హామీలెలా ఇస్తారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. హామీలను నెరవేర్చలేమని తెలిసీ.. చేస్తామని నమ్మబలికితే అది మోసం కాదా? అని చురకలంటించారు. గురువారం అనంతపురంలోని ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ‘నైతిక విలువలు-విద్యార్థుల బాధ్యత’ అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు నడవకపోతే యువత భగత్‌సింగ్ వారసులుగా నూతన సమాజం కోసం ముందుకు రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఫ్యాక్షన్ కేసుల విచారణలో విచక్షణ చూపండి పత్తికొండ: ఫ్యాక్షన్ కేసుల విచారణలో న్యాయమూర్తులు విచక్షణతో వ్యవహరించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ సూచించారు. ఫ్యాక్షన్ ముసుగులో సంబంధం లేని అమాయకులపై కేసులు బనాయిస్తున్నారని, వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు ఆవరణలో నిర్మించిన బార్ అసోసియేషన్ కార్యాలయ భవనాన్ని జస్టిస్ చంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వార్థ నాయకుల మాటలు విని అమాయకులు ఫ్యాక్షన్ ఊబిలో కూరుకుపోరాదన్నారు. -
లలిత కళలను పోషిస్తేనే గుర్తింపు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ విజయవాడ కల్చరల్ : ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు, లలిత కళలను పోషించినప్పుడే పాలకులు చరిత్రలో మిగిలిపోతారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్ర కుమార్ అన్నారు. తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య (ట్యాప్) ఆదివారం సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన, ఉగాది పురస్కార సభలో ఆయన ముఖ్యఅతి థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ జీవించే కళను నేర్చుకోవాలని సూచించారు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజా సంక్షేమ పథకాల అమలుతోపాటు, లలిత కళలను పోషించినప్పుడే పాలకులు చరిత్రలో మిగిలిపోతారని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు, అశోకుడు కళలను, కళాకారులను గౌరవించడం వల్లే చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. పాలకులు ఆదిశగా అడుగులు వేయాలని కోరారు. చిత్రకారులు, కవులు ప్రతి సమాజిక సమస్యపైనా స్పందించి దానికి ఒక రూపం ఇస్తారని, అదే చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ ప్రత్యేకంగా లలితకళా అకాడమీలు ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రరాష్ట్రంలో ఏర్పడిన లలితకళా అకాడమీని సీమాంధ్రకు తరలించాలని, అప్పుడే కళాకారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సీనియర్ పాత్రకేయుడు తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ 1993లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ అకాడమీలను రద్దుచేసిందని గుర్తుచేశారు. వాటిని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుఫున కోరుతున్నానని అన్నారు. బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాల్లాడుతూ కళలు, కళాకారులను ప్రతి ఒక్కరూ గౌరవిం చాలని కోరారు. తెలుగు ప్రపంచ చిత్ర కళాకారుల సమాఖ్య నిర్వహణలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, ప్రసిద్ధ చిత్రకారుడు తోట వైకుంఠం, సి.ఎస్.ఎన్.పట్నాయక్, ఎస్.ఎం. పీరన్కు ఈ సందర్భంగా ఉగాది పురస్కారాలు అందజేశారు. ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి వచ్చిన చిత్రకారుల తాము రూపొందించిన వందలాది చిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. రాష్ట్రవిభజన నేపథ్యంలో ఆళ్లగడ్డకు చెందిన విజయ్ చిత్రించిన దగాపడ్డ తమ్ముడు చిత్రం పలువురి ప్రశంశలు అందుకుంది. సాయంత్రం జరిగిన కళాకారుల సదస్సులో పలుకీలకమైన నిర్ణమాలు తీసుకున్నారు. లలిత కళాల అకాడమీని పుననుద్ధరించాలని, కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలని, 13 జిల్లాప్రతినిధులతో కమిటీ ఏర్పాటుచేసి, కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. -
సత్వర న్యాయం కోసమే లోక్‌అదాలత్‌లు
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరిగే కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్‌అదాలత్‌ల లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. హైదరాబాద్ నగర సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ,ప్రగతి సేవాట్రస్టుల ఆధ్వర్యంలో ఆదివారం గౌలిపురా పటేల్‌నగర్ ప్లే గ్రౌండ్ లో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ న్యాయస్థానానికి వచ్చేవారిని నిరుత్సాహపరిచేలా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కక్షిదారులను ఒప్పించి తక్షణమే కేసులు పరిష్కరించడానికి లోక్‌అదాలత్‌లు ఉపకరిస్తాయన్నారు. విద్యాహక్కుపై అవగాహన పెంచుకోవాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు బస్తీల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. సదస్సులో రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రి బ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ జి.యతిరాజులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నారాయణ, సిటీ సివిల్ కోర్టు తాత్కాలిక చీఫ్ జడ్జి ఆరవిందరెడ్డి, సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి జి. రాజగోపాల్, ప్రగతి సేవా ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ బి. ప్రతిభ పాల్గొన్నారు. అలరించిన ‘సప్తస్వర సంగమం’: వనస్థలిపురం రాజీవ్‌గాంధీ పార్కులో ఆదివారం రాత్రి సప్తస్వర సంగమం వీనుల విందు చేసింది.సినీ,వర్ధమాన గాయనీగాయకులు సుమధుర గానంతో ఆహూతులను అలరించారు. యువ గాయకులు శ్రీనివాస్, కళ్యాణి, సాయికృష్ణ, శ్రీవిద్య, దివాకర్, పావని, సంపత్ పాల్గొన్నారు. సినీ నేపథ్య గాయకులు రావు బాలసరస్వతీదేవి, వి.రామకృష్ణ, వడ్డేపల్లి శ్రీనివాస్, డి.వి.మోహనకృష్ణ, మృదంగ విద్వాంసులు పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావులను ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.చంద్రకుమార్ మాట్లాడుతూ మంచిపని ఏదైనా హృదయపూర్వకంగా, నిస్వార్థంగా చేయాలన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, నవీన విద్యాసంస్థల చైర్మన్ సుభాన్‌రెడ్డి, సమాచార హక్కు కమిషనర్ విజయ్‌బాబు, కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, యువ నటులు కౌశిక్‌బాబు, ఆకృతి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.