
ముంబై : సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్భాటంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నటి ఊర్మిళా మటోండ్కర్ ఆరు నెలలు తిరగకుండానే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఊర్మిళ రాజీనామాతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ముంబై నుంచి పోటీ చేసిన ఊర్మిళ బీజేపీ సీనియర్ నేత గోపాల్ శెట్టి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు తోడు నాయకత్వ లోపం, అంతర్గత కలహాలతో విసిగి ఆ పార్టీకి రాజీనామా చేశానని ఊర్మిళ పేర్కొన్నారు. ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ దియోరాతో తాను పంచుకున్న విశ్వసనీయ సమాచారం కూడా బహిర్గతం కావడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబైలో తన ఓటమికి పార్టీలో కొన్ని వర్గాలు పనిచేశాయని ఊర్మిళ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment