
అమరావతి : టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ముందు నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరున్నట్లు ప్రచారం జరిగినా చివరి నిమిషంలో మాత్రం ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు. పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్ బాబు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్‌లను ఖరారు చేశారు. దీంతో మరోసారి తనకు చంద్రబాబు మొండిచేయి చూపారని వర్ల రామయ్య ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు తీరుతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
చంద్రబాబును కలిసేందుకు కుటుంబంతో సహా బయలుదేరిన వర్ల రామయ్య కృష్ణా బ్యారేజీ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. తాను దళితుడిని అయినందునే తీవ్రంగా మరోసారి చంద్రబాబు అవమానించారని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు వర్ల రామయ్య, సీఎం రమేష్ అని విస్తృత ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment