varla ramayya
-
చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలపై.. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
-
అలా మాట్లాడటానికి ఆయనకు సిగ్గు లేదా: పోలీసు సంఘం
సాక్షి, విజయవాడ: పోలీస్ అధికారిగా పని చేసిన టీడీపీ నేత వర్ల రామయ్యకు పోలీసుల గురించి నీచంగా మాట్లాడడానికి సిగ్గులేదా అని ఆంధ్రప్రదేశ్ పోలీసు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్‌రావు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ: పోలీసు అధికారుల సంఘంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హౌసింగ్ చైర్మన్‌గా పని చేసిన ఆయన పోలీసు హౌసింగ్ ప్లాట్స్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. అదే విధంగా ఆర్టీసీ చైర్మన్‌గా పని చేసిన ఆయన పోలీసులకు కనీసం ఒక బస్‌పాస్ కూడా ఇప్పించలేకపోయారనన్నారు. కాగా పోలీసు అధికారిగా ఉన్నపుడు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. -
తీవ్ర నిరాశలో టీడీపీ నేత వర్ల రామయ్య
-
కృష్ణా బ్యారేజీ నుంచి వెనుదిరిగిన వర్ల
అమరావతి : టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ముందు నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరున్నట్లు ప్రచారం జరిగినా చివరి నిమిషంలో మాత్రం ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు. పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్ బాబు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్లను ఖరారు చేశారు. దీంతో మరోసారి తనకు చంద్రబాబు మొండిచేయి చూపారని వర్ల రామయ్య ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు తీరుతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చంద్రబాబును కలిసేందుకు కుటుంబంతో సహా బయలుదేరిన వర్ల రామయ్య కృష్ణా బ్యారేజీ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. తాను దళితుడిని అయినందునే తీవ్రంగా మరోసారి చంద్రబాబు అవమానించారని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు వర్ల రామయ్య, సీఎం రమేష్ అని విస్తృత ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. -
సర్పంచులకు ‘వర్ల’ ప్రలోభాలు
దోసపాడు(పెదపారుపూడి): పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వర్ల రామయ్య వైఎస్సార్ సీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను ఆ పార్టీలోకి తీసుకుని వెళ్లటానికి పెడుతున్న ప్రలోభాలు బెడిసి కొట్టాయని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శించారు. గ్రామంలో పార్టీ నాయకుడు మూల్పూరి చంద్రశేఖర్ ఇంటి వద్ద గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వర్ల రామయ్య నియోజకవర్గ ప్రజలను తప్పు దోవ పట్టించటానికి వైఎస్సార్ సీపీ నుంచి భారీగా టీడీపీ పార్టీలోకి చేరికలు ఉన్నాయంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తీరా బహిరంగ సభలో నియోజవర్గం నుంచి నలుగురు వైఎస్సార్ సీపీ నేతలనే టీడీపీలో చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. రామయ్యకు సవాల్.. గత ఎన్నికల్లో 1069 ఓట్లు తేడా ఓడిపోయిన రామయ్య ఈసారి ఎన్నికల్లో 30 వేల ఓట్లు తేడాతో ఓడిపోవటం ఖాయమని ఎమ్మెల్యే కల్పన సవాల్ చేశారు. ఈసారి రామయ్యకు పామర్రు సీటు రాదని తెలుసుకుని ప్రతి పనికి డబ్బులు వసూలు చేసుకుని పారిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ఎద్దేవా చేశారు. ఆయన ఇబ్బందులు తట్టుకోలేక పలువురు టీడీపీ సర్పంచ్ వైఎస్సార్ సీపీలో చేరేందుకు తనతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. మహేశ్వరపురం, వింజరంపాడు, భూషణగుళ్ళ సర్పంచులు కలుగురి వెంటేశ్వరరావు, జ్ఞానసుందరి, గోగం వరలక్ష్మి మాట్లాడుతూ పార్టీ మారితే భారీగా నిధులు ఇస్తామని టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేశారని వివరించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గోగం సురేష్, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి గోళ్ల సోమేశ్వరరావు, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ కొడాలి చిన్నా, మహిళ కన్వీనర్ సాయిల వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.