
సాక్షి, విజయవాడ: పోలీస్ అధికారిగా పని చేసిన టీడీపీ నేత వర్ల రామయ్యకు పోలీసుల గురించి నీచంగా మాట్లాడడానికి సిగ్గులేదా అని ఆంధ్రప్రదేశ్ పోలీసు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్‌రావు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ: పోలీసు అధికారుల సంఘంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హౌసింగ్ చైర్మన్‌గా పని చేసిన ఆయన పోలీసు హౌసింగ్ ప్లాట్స్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. అదే విధంగా ఆర్టీసీ చైర్మన్‌గా పని చేసిన ఆయన పోలీసులకు కనీసం ఒక బస్‌పాస్ కూడా ఇప్పించలేకపోయారనన్నారు. కాగా పోలీసు అధికారిగా ఉన్నపుడు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment