టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ముందు నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరున్నట్లు ప్రచారం జరిగినా చివరి నిమిషంలో మాత్రం ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చారు. పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్ బాబు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్‌లను ఖరారు చేశారు. దీంతో మరోసారి తనకు చంద్రబాబు మొండిచేయి చూపారని వర్ల రామయ్య ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు తీరుతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
తీవ్ర నిరాశలో టీడీపీ నేత వర్ల రామయ్య
Published Sun, Mar 11 2018 5:47 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
Advertisement