సర్పంచులకు ‘వర్ల’ ప్రలోభాలు | tdp politics | Sakshi
Sakshi News home page

సర్పంచులకు ‘వర్ల’ ప్రలోభాలు

Published Thu, Jul 21 2016 10:21 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

సర్పంచులకు ‘వర్ల’ ప్రలోభాలు - Sakshi

సర్పంచులకు ‘వర్ల’ ప్రలోభాలు

దోసపాడు(పెదపారుపూడి):
పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల రామయ్య వైఎస్సార్‌ సీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను ఆ పార్టీలోకి తీసుకుని వెళ్లటానికి పెడుతున్న ప్రలోభాలు బెడిసి కొట్టాయని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శించారు. గ్రామంలో పార్టీ నాయకుడు మూల్పూరి చంద్రశేఖర్‌ ఇంటి వద్ద గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వర్ల రామయ్య నియోజకవర్గ ప్రజలను తప్పు దోవ పట్టించటానికి వైఎస్సార్‌ సీపీ నుంచి భారీగా టీడీపీ పార్టీలోకి  చేరికలు ఉన్నాయంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తీరా బహిరంగ సభలో నియోజవర్గం నుంచి  నలుగురు వైఎస్సార్‌ సీపీ నేతలనే టీడీపీలో చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు.  
రామయ్యకు సవాల్‌..
గత ఎన్నికల్లో 1069 ఓట్లు తేడా ఓడిపోయిన రామయ్య ఈసారి ఎన్నికల్లో 30 వేల ఓట్లు తేడాతో ఓడిపోవటం ఖాయమని ఎమ్మెల్యే కల్పన సవాల్‌ చేశారు. ఈసారి రామయ్యకు పామర్రు సీటు రాదని తెలుసుకుని ప్రతి పనికి డబ్బులు వసూలు చేసుకుని పారిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ఎద్దేవా చేశారు. ఆయన ఇబ్బందులు తట్టుకోలేక పలువురు టీడీపీ సర్పంచ్‌ వైఎస్సార్‌ సీపీలో చేరేందుకు తనతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. మహేశ్వరపురం, వింజరంపాడు, భూషణగుళ్ళ సర్పంచులు కలుగురి వెంటేశ్వరరావు, జ్ఞానసుందరి, గోగం వరలక్ష్మి మాట్లాడుతూ పార్టీ మారితే భారీగా నిధులు ఇస్తామని టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేశారని వివరించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ గోగం సురేష్, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి గోళ్ల సోమేశ్వరరావు, మండల ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ కొడాలి చిన్నా, మహిళ కన్వీనర్‌ సాయిల వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement