
సాక్షి, హైదరాబాద్ : ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా దేవినేని ఉమ, చంద్రబాబునాయుడు, నారాలోకేష్, పచ్చమీడియాపై సాయిరెడ్డి ధ్వజమెత్తారు. ‘మరో 4 వారాలు ఓపిక పట్టు ఉమా. ఇరిగేషన్ శాఖలో ఐదేళ్లుగా నువ్వు సాగించిన అరాచకం అంతా బయటకొస్తుంది. అధికారులు, బాధితులైన కాంట్రాక్లర్లు నీ దోపిడీ వ్యవహారాల ఫైళ్లను స్వచ్ఛందంగా తెచ్చిస్తున్నారు. పోలవరం, హంద్రీ-నీవాల్లో రెండేళ్లలోనే వందల రెట్లు అంచనాలు పెంచింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు.
ప్రపంచ ఆర్థిక సదస్సుకు దావోస్ వెళ్లిన మధ్యప్రదేశ్ సీఎం, విడిది కోసం రూ.1.8 కోట్లు ఖర్చు పెట్టారని పచ్చ మీడియా గగ్గోలు పెడుతోందని, మరి ఆహ్వానం లేకున్నా బాబు, ఆయన కుమారుడు 4 సార్లు ప్రత్యేక విమానాల్లో వెళ్లి ప్రజలపై రూ.100 కోట్ల భారం మోపిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించరని విజయసాయిరెడ్డి నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment