
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘'అంగిట బెల్లం ఆత్మలో విషం’ అనేది చంద్రబాబు నైజాన్నివర్ణించడానికే పుట్టింది. పైకి ఎక్కడలేని ప్రేమ నటిస్తాడు.చేసేవి మాత్రం బీసీలను అణగదొక్కే పనులు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా, ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటాడు. తన వర్గం తప్ప బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశారు’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
‘అణగారిన వర్గాల పట్ల బాబు ద్వేషం మరోసారి బైటపడింది. వారిని వోట్ బ్యాంక్ గా చూడటం తప్ప రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చాలన్న చిత్తశుద్ధి ఏనాడూ లేదు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85% రిజర్వేషన్ల అమలుకు సీఎం జగన్ గారు నిర్ణయిస్తే కోర్టులో కేసు వేయించి కొట్టేయించారు’ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.