ముంబై: మహారాష్ట్రలో 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా అధికారం చెపట్టలేకపోయిందని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నెంబర్ గేమ్‌లో వెనకబడ్డామని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడానికి పలు కారణాలను విశ్లేషించారు. ఎన్నికల ఫలితాలపై ఫడ్నవీస్ స్పందిస్తూ 40శాతం మార్కులు సాధించిన శివసేన కూటమి అధికారం కైవసం చేసుకోగా, 70శాతం సాధించిన బీజేపీ ప్రతిపక్షంలో సరిపెట్టుకోందని వ్యాఖ్యానించారు. అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
మహా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫడ్నవీస్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడతానని చెప్పడాన్ని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్న నేపథ్యంలో.. వారికి కౌంటర్‌గా ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో తాను రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను ప్రారంభించానని చెప్పారు. మళ్లీ ఆ ప్రాజెక్టులను తానే కొనసాగిస్తామోనని వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment