
కృష్ణా జిల్లా: భారతదేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి లాంటి అవినీతి ముఖ్యమంత్రి మరెవ్వరూ లేరని వైఎస్సార్‌సీపీ నేత సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. పామర్రు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకులు ఇసుక, మట్టి దోచుకుని రూ.వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు విజయవాడకు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజల డబ్బుతో చంద్రబాబు జల్సా చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు తన ఎల్లో మీడియాతో దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment