సాక్షి, హైదరాబాద్ : ‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల ముందు ఒక విషయంలో పొరపాటు చేశానని వాపోతున్నాడట. జ్యూడిషియరీ, సీబీఐ, ఈడీ, విజిలెన్స్ కమిషన్లు లాంటి సంస్థల్లోకి తన వాళ్లను తెలివిగా జొప్పించగలిగానని, ఎన్నికల సంఘంలో కూడా ఒక కమిషనర్ తన వాడు ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదని తెగ బాధపడుతున్నాడట’ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. బుధవారం ట్విటర్ వేదికగా ఆయన చంద్రబాబు, టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు.
ఫైబర్ నెట్ కార్పోరేషన్ అనేది రూ.10,000 కోట్ల కుంభకోణమని, తమిళనాడులో ‘అరసు’ నెట్ వర్క్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసి కూడా ప్రజాధనాన్ని దిగమింగారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనకు డప్పు కొట్టని టీవీ చానెళ్ల సిగ్నల్స్ ను అడ్డుకోవడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. చివరకు ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితికి తెచ్చారని మండిపడ్డారు.
ఇంకెంత మంది అజ్ణాతంలోకి వెళ్తారో?
‘హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీ ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో ఎంపీ సుజనా చౌదరి సీబీఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడు. మే 23 తర్వాత ఇంకెంత మంది అజ్ణాతంలోకి వెళ్తారో?’ అని సందేహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment